వాస్తవాలను వార్తలుగా, ప్రజా సమస్యల వారధిగా ‘కాకతీయ’
కాకతీయ దిన పత్రిక 2026 క్యాలెండర్ ఆవిష్కరణలో….
దుగ్గొండి మండల అధికారులు
కాకతీయ, దుగ్గొండి: అనాతికాలంలోనే డిజిటల్ మీడియా రంగంలో పాఠకుల మన్ననలు పొంది వాస్తవాలను వార్తలుగా మలచి ప్రజా సమస్యల వారధిగా ‘కాకతీయ’ దినపత్రిక గుర్తింపు సాధించిందని దుగ్గొండి మండల అధికారులు తహసీల్దార్ రాజేశ్వర్ రావు, ఎంపీవో శ్రీధర్ గౌడ్, ఎస్సై రణధీర్ రెడ్డి, ఏంఈవో వెంకటేశ్వర్లు, డిప్యూటీ తహసీల్దార్ ఉమారాణి, సూపరిండెంట్ రవి కుమార్ లు అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ‘కాకతీయ’ దిన పత్రిక 2026 ను అధికారులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో కాకతీయ రిపోర్టర్ పర్లపల్లి ప్రతాప్, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాంబాబు, మల్లయ్య, జూనియర్ అసిస్టెంట్ లు శత్రజ్ఞ రంజిత్, మురళి, రాజేందర్, శరత్, టైపిస్ట్ అనిత, వివిధ గ్రామాల పంచాయితీ కార్యదర్శులు పాల్గొన్నారు.


