మిచెల్, కాన్వే హాఫ్ సెంచరీలు
టీమ్ఇండియా ముంగిట భారీ లక్ష్యం
కాకతీయ, స్పోర్ట్స్ డెస్క్: వడోదర వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి సరిగ్గా 300 పరుగులు చేసింది. ఓపెనర్లు డేవన్ కాన్వే (56 పరుగులు), హెన్రీ నికోల్స్ (62 పరుగులు), డారిల్ మిచెల్ (84 పరుగులు) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ తలో 2, కుల్దీప్ యాదవ్ 1 వికెట్ పడగొట్టారు. కివీస్‌ను భారీ స్కోర్ చేయడంలో భారత్ కట్టడి చేయలేకపోయింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు పరుగులు రాబట్టారు న్యూజిలాండ్ బ్యాటర్లు.
వరుస టాస్‌లు ఓడిపోతూ వస్తున్న శుభమన్ గిల్ కివీస్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్నాడు. టీమిండియా పేసర్లు మొహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ తొలి వికెట్‌ను తీయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. భారత బౌలర్లు ఎంత ప్రయత్నించినా మొదటి వికెట్ పడటానికి 22వ ఓవర్ వరకూ ఎదురుచూడాల్సి వచ్చింది. హర్షిత్ రాణా అద్భుత బౌలింగ్‌తో సెటిల్ ఓపెనర్లు హెన్రీ నికోలస్, డెవాన్ కాన్వేను వెంటవెంటనే అవుట్ చేయడంతో భారత్‌కు బ్రేక్ త్రూ దక్కింది. నికోలస్ 69 బంతుల్లో 62 పరుగులు చేయగా, కాన్వే 67 బంతుల్లో 56 పరుగులు చేసి అవుటయ్యాడు. ఈ ఇద్దరూ అవుటైన తర్వాత వరుస వికెట్లు పడుతూ వస్తున్నా డారెల్ మిచెల్ మాత్రం నిలకడగా ఆడుతూ వస్తూ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లాడు.
ముగ్గురు స్పిన్నర్లు బౌలింగ్ చేసినప్పటికీ ఒక్క వికెట్టే..
భారత బౌలర్లలో మొహమ్మద్ సిరాజ్ రెండు వికెట్లు తీసుకోగా.. యువ బౌలర్లు ప్రసిద్ధ్ కృష్ణ హర్షిత్ రాణాకి కూడా రెండు వికెట్లు దక్కాయి. కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ ఐదు ఓవర్లు బౌలింగ్ చేసి 27 పరుగులు ఇవ్వగా, రవీంద్ర జడేజా 9 ఓవర్లలో 56 పరుగులు ఇచ్చాడు. మొత్తం 8 వికెట్లు పడగా ఒకటి రనౌట్ కాగా, ఆరు వికెట్లు పేసర్లకు దక్కాయి. ముగ్గురు స్పిన్నర్లు బౌలింగ్ చేసినప్పటికీ ఒక్క వికెట్టే దక్కడం విశేషం.


