50లో 20 అందంతో ..
మత్తెక్కిస్తున్న మలైక అరోరో తాజా ఫోటోలు
కాకతీయ, సినిమా డెస్క్ : బాలీవుడ్ ముద్దుగుమ్మల్లో మలైకా అరోరా స్పెషల్ అనడంలో సందేహం లేదు. ఇండస్ట్రీలో అడుగుపెట్టి మూడు దశాబ్దాలు దాటింది. ఇండస్ట్రీలో అడుగుపెట్టింది మొదలుకుని అన్ని భాషల ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తూ వచ్చింది. ఆకట్టుకునే అందంతో పాటు డాన్స్ విషయంలో ఎంతో మందికి పోటీ అన్నట్లుగా ఈ అమ్మడు నిలిచింది. అందుకే బాలీవుడ్‌లో అత్యంత ఖరీదైన ఐటెం గర్ల్ అంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. మలైకా అరోరా వయస్సు విషయంలో కాస్త గందరగోళం ఉంది. అయితే కాస్త అటు ఇటుగా ఆమె వయసు 50 ఏళ్లు అనడంలో ఎలాంటి సందేహం లేదు. సాధారణంగా 50 ఏళ్ల వయసులో ముసలితనంకు వచ్చినట్లుగా అంతా ఫీల్ అవుతారు. కానీ మలైకా మాత్రం తాను ఇంకా ఇరవై ఏళ్ల వయసులోనే ఉన్నట్లుగా ఫీల్ అవుతున్నట్లుగా ఉంది. అందుకే ఆమె ఔట్ ఫిట్ అలాంటివి ధరిస్తుందని కొందరు అంటూ ఉంటారు. మొత్తానికి మలైకా అరోరా ఏ ఔట్ ఫిట్ వేసినా కూడా చర్చనీయాంశం కావడం ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం అరోరా సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసే ఫోటోలు కనీసం చూపు తిప్పనివ్వడం లేదు అంటూ చాలా మంది అంటూ ఉంటారు. 50 ఏళ్ల వయసులో ఏమీ ఈ అందం… తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫోటోలతో మలైకా అరోరా కన్నుల విందు చేసింది అంటూ ప్యాన్స్ తెగ సంబరపడుతున్నారు.


