నేనింకా ముసలోడిని కాలేదురా..
గిల్, సిరాజ్‌తో రోహిత్ శర్మ!
కాకతీయ, స్పోర్ట్స్ డెస్క్: భారత్ వర్సెస్ న్యూజిలాండ్ తొలి వన్డేలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా వడోదర వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, కెప్టెన్ శుభ్‌మన్ గిల్, పేసర్ మహమ్మద్ సిరాజ్ మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. ‘నేనింకా ముసలోడిని కాలేదురా’అని రోహిత్ అనడం నవ్వులు పూయించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
అసలేం జరిగిందంటే..?
న్యూజిలాండ్ బ్యాటింగ్ సందర్భంగా మహమ్మద్ సిరాజ్ వేసిన 28వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ తొలి బంతిని డారిల్ మిచెల్ మిడ్ వికెట్ దిశగా ఆడగా.. రోహిత్ శర్మ అద్భుతమైన డైవ్‌తో ఆపాడు. అతని ఫీల్డింగ్‌కు ఫిదా అయిన సిరాజ్, శుభ్‌మన్ గిల్ దగ్గరకు వెళ్లి అభినందించారు. మరోవైపు ప్రేక్షకులు సైతం గట్టిగా అరిచారు. రోహిత్ శర్మ మాత్రం భిన్నంగా స్పందించాడు. ‘అదేం అంత కష్టమైన డైవ్ కాదు ఫ్రెండ్స్. నాకు ఇంకా అంత వయసు అయిపోలేదు.’అని అన్నాడు. ఆ మాటలకు గిల్, సిరాజ్ నవ్వు ఆపుకోలేకపోయారు


