చరిత్రసృష్టించిన విరాట్ కోహ్లీ..
గంగూలీ రికార్డ్ బద్దలు!
కాకతీయ, స్పోర్ట్స్ డెస్క్ : టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. భారత్ తరఫున అత్యధిక వన్డేలు ఆడిన ఐదో ప్లేయర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రికార్డ్‌ను అధిగమించాడు. న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా వడోదర వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో కోహ్లీ ఈ ఫీట్ సాధించాడు. ఇది కోహ్లీకి 309వ వన్డే కాగా.. సౌరవ్ గంగూలీ 308 వన్డేలు ఆడాడు. భారత్ తరఫున అత్యధిక వన్డేలు ఆడిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ టెండూల్కర్ 463 మ్యాచ్‌లతో టాప్‌లో ఉండగా.. 347 వన్డేలతో మహేంద్ర సింగ్ ధోనీ, 340 మ్యాచ్‌లతో రాహుల్ ద్రవిడ్, మహమ్మద్ అజారుద్దీన్(334) కోహ్లీ కంటే ముందున్నారు.


