epaper
Thursday, January 15, 2026
epaper

సంక్షేమ, అభివృద్ధితో ప్రజల జీవితాల్లో మార్పు

సంక్షేమ, అభివృద్ధితో ప్రజల జీవితాల్లో మార్పు
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
రాజకీయాలకు అతీతంగా ఇందిరమ్మ ఇండ్లు
96 లక్షల కుటుంబాలకు సన్న బియ్యం
800 మెగావాట్ల ప్లాంట్‌కు క్యాబినెట్ గ్రీన్‌సిగ్నల్
5 లక్షల ఉద్యోగులకు ప్రమాద బీమా
పేదల ప్రభుత్వానికి మద్దతు అవసరం
రామగుండం అభివృద్ధి కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం

కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ బ్యూరో : ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ఆయన మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, దుదిల్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారు హర్క వేణుగోపాల్, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్లు జే. అరుణ శ్రీ, డి. వేణు, ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ తదితరులతో కలిసి రామగుండంలో పర్యటించారు. ఈ సందర్భంగా నగరంలోని వివిధ డివిజన్లలో రూ.80 కోట్ల 52 లక్షల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు, టియూఎఫ్ఐడి ద్వారా రూ.88 కోట్ల 90 లక్షలతో అమలు చేయనున్న నీటి సరఫరా పైప్‌లైన్ నిర్మాణ పనులకు అలాగే ఆర్ అండ్ బీ శాఖ ద్వారా రూ.6.5 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

ఇండ్ల పంపిణీతో ప్రజలకు భరోసా

రాష్ట్ర ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు తీసుకురావడమే లక్ష్యంగా పాలన సాగిస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఆదివారం రామగుండంలో పర్యటించిన ఆయన నగరంలో నిర్మించిన 633 డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు లబ్ధిదారులకు పంపిణీ చేశారు అలాగే 494 ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ను మంజూరు చేశారు. బహిరంగ సభలో మాట్లాడిన డిప్యూటీ సీఎం ప్రజా అవసరాలే పాలనకు కేంద్రబిందువని పేర్కొన్నారు. తొలి ఏడాదిలోనే రూ.22,500 కోట్లతో 4.5 లక్షల ఇండ్లు మంజూరు చేయడం ప్రజా ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. పేదలు ఆత్మగౌరవంతో జీవించాలనే లక్ష్యంతో ప్రతి సోమవారం ఇందిరమ్మ ఇండ్లకు నిధులు విడుదల చేస్తున్నామని సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా 96 లక్షల కుటుంబాలకు ఉచిత బియ్యం, లక్షలాది కుటుంబాలకు ఉచిత విద్యుత్, మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం అమలులో ఉందని వెల్లడించారు. రామగుండం అభివృద్ధికి కీలకంగా 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్కు క్యాబినెట్ ఆమోదం లభించిందని సింగరేణి పరిరక్షణకు కొత్త ప్రణాళికలు అమలు చేస్తామని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.

రామగుండానికి సంక్షేమ అభివృద్ధి హామీలు

పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ అజెండా అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్న బియ్యం సరఫరా, నూతన రేషన్ కార్డుల జారీ అమలులో ఉన్నాయని తొలి విడతలోనే రూ.22,500 కోట్లతో 4.5 లక్షల ఇండ్లు మంజూరు చేశామని రాజకీయాలకు అతీతంగా పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని తెలిపారు. రామగుండంలో 633 డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు పంపిణీ చేశామని మరో 300 ఇండ్ల పనులు పూర్తి చేస్తామని వెల్లడించారు. అనంత‌రం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ రామగుండం అభివృద్ధికి రూ.600 కోట్ల పనులకు నాంది పలికినట్టు తెలిపారు. రోడ్డు విస్తరణతో నష్టపోయే వారికి ఉపాధి, స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ఇందిరమ్మ కమిటీ ద్వారా అర్హులను ఎంపిక చేసి 479 మందికి ప్రొసీడింగ్స్ అంద‌జేశామ‌ని స్ప‌ష్టం చేశారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ సింగరేణి కార్మికులకు ఇంటి స్థలాల క్రమబద్ధీకరణకు చర్యలు, ఆలయాల అభివృద్ధికి రూ.3 కోట్లు మంజూరు చేస్తామని, జర్నలిస్టులు, ట్రాన్స్‌జెండర్ల సంక్షేమంపై ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ సంక్షేమంతో పాటు మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు.

రామగుండంలో పెండింగ్‌కు తెర, 1700 కుటుంబాలకు పట్టాలు

పదేళ్లకుపైగా పెండింగ్‌లో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపుతూ 1,700కి పైగా నిరుపేద కుటుంబాలకు వివిధ పథకాల కింద ఇండ్ల పట్టాలు పంపిణీ చేసినట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. మేడిపల్లిలో 212 కుటుంబాలు, జనగామలో 31 మంది ట్రాన్స్‌జెండర్లు, గోదావరిఖని వరద ప్రభావిత ప్రాంతాల్లోని 129 కుటుంబాలు, మారేడు పాకలో సింగరేణి భూ సమస్య పరిష్కరించి 162 కుటుంబాలకు, జీఓ 76 పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంతో పట్టాలు అందించడం జ‌రిగింద‌ని అలాగే 633 డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల లబ్ధిదారులు రెండు నెలల్లో గృహప్రవేశం చేసేలా డ్రైనేజీ సహా మౌలిక వసతులు కల్పిస్తామని నగర వ్యాప్తంగా 494 మంది నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ అందించామని కలెక్టర్ తెలిపారు. రామగుండం అభివృద్ధి కోసం రూ.169 కోట్లతో త్రాగునీటి సరఫరా, సీవరేజ్ ప్లాంట్ల పనులకు శంకుస్థాపన జరిగిందని గత రెండేళ్లలో నగరపాలక సంస్థ పరిధిలో రూ.562 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామని పేర్కొన్నారు. రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యానికి ముగింపు పలుకుతూ అభివృద్ధి పథం మొదలైందన్నారు. 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు, సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు బోనస్ వంటి నిర్ణయాలు ప్రజలకు మేలు చేస్తున్నాయన్నారు. మరో తహసిల్దార్ కార్యాలయం, జూనియర్ కళాశాల భవనం, జనరల్ ఆసుపత్రికి అదనంగా రూ.50 కోట్లు మంజూరు చేయాలని కోరారు. ట్రాన్స్‌జెండర్ సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ రామగుండంలో 50 మందికి ఇంటి పట్టాలు, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. వ్యాపార, వైద్య, పర్యాటక కేంద్రంగా రామగుండాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వృద్ధురాలిని నట్టేట ముంచారు..!

వృద్ధురాలిని నట్టేట ముంచారు..! విలువైన భూముల అక్రమ రిజిస్ట్రేషన్లు మీడియా ముందుకు వచ్చిన శంభునిపల్లి...

జర్నలిస్టుల అరెస్టులు అన్యాయం

జర్నలిస్టుల అరెస్టులు అన్యాయం అక్రమ అరెస్టులను ఖండించిన టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కో కన్వీనర్ కే....

పురాభివృద్ధే నా లక్ష్యం..!

పురాభివృద్ధే నా లక్ష్యం..! ఎన్నికల హామీల అమలే ప్రాధాన్యం క్యాతన్‌పల్లిలో అభివృద్ధి పనులకు శ్రీకారం సీసీ...

వావిలాలలో వైభవంగా గోదాదేవి కల్యాణం

వావిలాలలో వైభవంగా గోదాదేవి కల్యాణం కాకతీయ, జమ్మికుంట : ధనుర్మాస ఉత్సవాల ముగింపు...

వలపు వల… లక్షల లూటీ

వలపు వల… లక్షల లూటీ ఇన్‌స్టాగ్రామ్ ముసుగులో సెక్స్ ట్రాప్ నగ్న వీడియోలతో...

వాస్తవాల‌కు వేదికగా కాకతీయ

వాస్తవాల‌కు వేదికగా కాకతీయ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ కంచె వేణు కాకతీయ, హుజురాబాద్ : ప్రజా...

నో కాంప్రమైజ్.. ఆన్ డ్యూటీ..!

నో కాంప్రమైజ్.. ఆన్ డ్యూటీ..! ఎస్సైపై వేటు నిలిపివేయాల‌ని ఎమ్మెల్యే హుకుం..!! వెన‌క్కి త‌గ్గ‌ని...

సీఏం రేవంత్ రెడ్డి మాటల మాంత్రికుడు

సీఏం రేవంత్ రెడ్డి మాటల మాంత్రికుడు 6 డీఏలు పెండింగ్ అంటే రాష్ట్రం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img