ఇల్లంతకుంటలో కూడారై ఉత్సవాలు
అపర భద్రాద్రిలో భక్తుల సందడి
పాయసం నివేదనతో ప్రత్యేక పూజలు
కాకతీయ, జమ్మికుంట : అపర భద్రాద్రిగా పేరుగాంచిన ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ఆదివారం కూడారై ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు వంశీధర్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి, ఇత్తడి–వెండి గంగాళాల్లో సిద్ధం చేసిన పాయసాన్ని గోదా రంగనాథ స్వామికి నివేదించారు. ఉత్సవాల్లో పాల్గొనేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణమంతా భక్తి శ్రద్ధలతో మార్మోగింది. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఇంగ్లే రామారావు, ధర్మకర్తలు, పలువురు భక్తులు పాల్గొని ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.


