కాలువలోకి దూసుకెళ్లిన ఇసుక లారీ
స్వల్ప గాయాలతో బయటపడ్డ డ్రైవర్
కాకతీయ, జమ్మికుంట : కరీంనగర్ జిల్లా జమ్మికుంట వీణవంక మండలం రెడ్డిపల్లి గ్రామ సమీపంలో ఆదివారం ఇసుకను తరలిస్తున్న లారీ అద్భుతప్పి కాలువలో పడిపోయింది. ప్రమాద సమయంలో లారీ డ్రైవర్ అప్రమత్తంగా స్పందించడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ మార్గంలో ఇసుక లారీల వేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. భారీ లారీల రాకపోకలతో గ్రామంలో భయాందోళన నెలకొందని తెలిపారు. ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


