దటీజ్ మెగాస్టార్
బుక్ మై షోలో రికార్డులు
మన శంకర వర ప్రసాద్ గారు చిత్రానికి ఒక్క గంటలోనే 13 వేల టికెట్స్ బుక్
కాకతీయ, సినిమా డెస్క్: మెగా అభిమానులు ఎదురుచూస్తున్న చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం మన శంకర వర ప్రసాద్ గారు. నేడు (సోమవారం) రిలీజ్ కానుండటంతో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది చిరు టీం. కాగా పాపులర్ ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫాం బుక్ మై షోలో మన శంకర వరప్రసాద్ గారు ట్రెండ్ కొనసాగుతోంది. బుక్ మై షోలో ఒక్క గంటలో 13 వేల టికెట్స్ బుకయ్యాయి. ఈ లెక్కన మన శంకర వర ప్రసాద్ మేనియా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆదివారం ప్రీమియర్స్ నేపథ్యంలో మన శంకర వర ప్రసాద్ బాక్సాఫీస్ వద్ద టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తూ సినిమాపై అంచనాలను మరింత పెంచేస్తుంది.
అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ‘పండగకు వస్తున్నారు’ అనే ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కింది. ఈ మూవీలో లేడీ సూపర్ స్టార్ నయనతార ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తుండగా.. వెంకటేశ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. వీటీవీ గణేశ్, కేథరిన్ థ్రెసా, హర్షవర్దన్, రేవంత్ భీమల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల-విష్ణు ప్రసాద్ హోం బ్యానర్ గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా తెరకెక్కిస్తుండగా.. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు.


