తగ్గని సమంత క్రేజ్..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘మా ఇంటి బంగారం’ టీజర్
కాకతీయ, సినిమా డెస్క్ : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ సోషల్ మీడియాలో రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా విడుదలైన ఈ చిత్ర టీజర్ ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ, అతి తక్కువ సమయంలోనే 20 మిలియన్లకు పైగా డిజిటల్ వ్యూస్‌ని సొంతం చేసుకుని రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. పెళ్లి అయిన అనంతరం పల్లెటూరికి కోడలిగా వెళ్లిన సమంతకి అక్కడ ఎదురైన సంఘటనలు ఏంటి.. తన గతం ఏంటి అనేది ఈ సినిమా కథ అని తెలుస్తుంది. ప్రముఖ దర్శకుడు సమంత భర్త రాజ్ నిడిమోర్ ఈ కథను రాయగా.. నందినీరెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సమంత సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా పిక్చర్స్ దీనిని నిర్మిస్తోంది. సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్నారు.


