2 మిలియన్ క్లబ్లో ‘రాజాసాబ్’
ఓవర్సీస్లో ప్రభాస్ మార్క్
కాకతీయ, సినిమా డెస్క్: పాన్ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఇండియన్ బిగ్గెస్ట్ ఫిల్మ్ ‘ది రాజాసాబ్’. హారర్ ఫాంటసీ జాన్రాలో తెరకెక్కిన ఈ మూవీ భారీ అంచనాలతో జనవరి 9న వరల్డ్‌వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం ‘రాజాసాబ్’ భారత్‌తోపాటు ఓవర్సీస్లోనూ జోరుగా సందడి చేస్తోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో మాత్రం ఈ సినిమా దూకుడు కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఈ చిత్రం మరో అరుదైన ఘనతను సాధించింది. సినిమా విడుదలకు ముందే నార్త్ అమెరికా బాక్సాఫీస్ వద్ద భారీ రికార్డులను సృష్టించింది. కేవలం ప్రీమియర్ల ద్వారానే మిలియన్ డాలర్లు వసూలు చేసింది. అలా రిలీజ్‌కు ముందే ఈ సినిమా అక్కడ 1.1 మిలియన్ క్లబ్లో చేరడం విశేషం. తాజాగా రాజాసాబ్ 2 మిలియన్ డాలర్ల మార్క్‌ను దాటేసి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఇంత తక్కువ టైమ్‌లోనే 2 మిలియన్ డాలర్లు వసూల్ చేసిందంటే ఓవర్సీస్ మార్కెట్లో ప్రభాస్‌కు ఏ రేంజ్లో క్రేజ్ ఉందో దీని బట్టి క్లియర్‌గా తెలుస్తోంది.


