గొత్తి కోయ గూడెంలో రెడ్‌క్రాస్ సేవలు
గిరిజన కుటుంబాలకు దుస్తుల పంపిణీ
గవర్నర్ ఆదేశాలతో కార్యక్రమం
కాకతీయ, ఏటూరునాగారం : ములుగు జిల్లా కన్నాయి గూడెం మండలం చింతగూడెం గ్రామ పంచాయితీ పరిధిలోని కొయ్యురు గొత్తి కోయ గూడెంలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో దుస్తుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు జిష్ణుదేవ్ వర్మ ఆదేశాల మేరకు, ములుగు జిల్లా కలెక్టర్, రెడ్‌క్రాస్ జిల్లా అధ్యక్షుడు దివాకర్ టి.ఎస్. ఐఏఎస్ సూచనలతో ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. అభయ ఫౌండేషన్ అందించిన దుస్తులను చింతగూడెం సర్పంచ్ అల్లెం అనిత నర్సింగరావు, ఉపసర్పంచ్ దుర్గం అనిత ప్రభాకర్, బుట్టయి గూడెం సర్పంచ్ జాడి రాంబాబు, కన్నాయి గూడెం కాంగ్రెస్ మండల అధ్యక్షుడు యండి అఫ్సర్ పాష, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ములుగు జిల్లా పాలక మండలి సభ్యుడు ముస్కు గోవర్ధన్ రెడ్డి గిరిజన కుటుంబాలకు పంపిణీ చేశారు.
కుటుంబాలకు అవసరమైన వస్త్రాలు
ఈ కార్యక్రమంలో 20 కుటుంబాలకు 6 కుర్తాలు, 44 పిల్లోలు, 44 బ్లౌజులు, 16 బ్లాంకెట్లు, 44 నెక్కర్లు, 6 పైజామాలు, 26 ట్రౌజర్లు, 66 షర్టులు తదితర దుస్తులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వంగల సుమన్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యుడు సునార్కని రాంబాబు, మాజీ ఉపసర్పంచ్ జంగా కృష్ణ, యూత్ అధ్యక్షుడు గోస్కుల నవీన్, సోషల్ మీడియా మండల కోఆర్డినేటర్ గోస్కుల సదన్ రావు, యూత్ నాయకులు మహేష్, సాంబయ్యతో పాటు గొత్తి కోయ గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


