epaper
Thursday, January 15, 2026
epaper

సత్తుపల్లి కేంద్రంగా రూ.547 కోట్ల సైబర్‌ మోసం

సత్తుపల్లి కేంద్రంగా రూ.547 కోట్ల సైబర్‌ మోసం
ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు ఎర‌
వారి అకౌంట్ల‌ను అంతర్జాతీయ నేరాలకు వినియోగం
హెచ్‌డీఎఫ్ఎసీ, సౌత్ ఇండియన్ బ్యాంకుల్లో భారీగా లావాదేవీలు
ఆస్ట్రేలియా సైబర్ కేసులే ఆధారం… పోలీసుల లోతైన దర్యాప్తు
నిందితుల‌ను అరెస్టు చేసిన ఖ‌మ్మం పోలీసులు
వివ‌రాలు వెల్ల‌డించిన ఖ‌మ్మం పోలీస్ క‌మిష‌న‌ర్ సునిల్ ద‌త్‌

కాకతీయ, వెబ్‌డెస్క్ : సత్తుపల్లి కేంద్రంగా పనిచేస్తూ అంతర్జాతీయ సైబర్ నేరగాళ్లతో చేతులు కలిపిన ముఠా, ఉద్యోగాల పేరిట నిరుద్యోగ యువతను మోసం చేసి వారి బ్యాంక్ ఖాతాలను సైబర్ నేరాలకు వినియోగించిన భారీ స్కాం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఇప్పటివరకు గుర్తించిన లావాదేవీల విలువ ఏకంగా రూ.547 కోట్లుగా పోలీసులు నిర్ధారించారు. తేదీ 24-12-2025 ఉదయం తుంబూరు గ్రామానికి చెందిన మోదుగ సాయికిరణ్ వీఎం బంజార పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 2022లో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి నిందితులు పోట్రు మనోజ్ కళ్యాణ్, పోట్రు ప్రవీణ్, ఉడతనేని వికాస్ చౌదరి, మోరంపూడి చెన్నకేశవులు తనతో హెచ్‌డీఎఫ్‌సీ, సౌత్ ఇండియన్ బ్యాంకుల్లో ఖాతాలు తెరిపించి, బ్యాంకింగ్ కిట్, ఏటీఎం కార్డులు, ఆన్‌లైన్ క్రెడెన్షియల్స్ తమ వద్దకు తీసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నవంబర్ చివరి వారంలో ప్రవీణ్, చెన్నకేశవులు ఆస్ట్రేలియా పౌరులను సైబర్ మోసాలకు పాల్పడ్డ కేసులో అరెస్టు అయ్యారని తెలుసుకున్న బాధితుడు తన అకౌంట్లను పరిశీలించగా, కోట్ల రూపాయల్లో అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్టు గుర్తించి పోలీసులను ఆశ్రయించాడు.

బ్యాంక్ ఖాతాల నుంచి కోట్ల‌ల్లో లావాదేవీలు..
దర్యాప్తులో నిందితులు, వారి కుటుంబ సభ్యులు, అనుచరుల బ్యాంక్ అకౌంట్లలో భారీగా లావాదేవీలు జరిగినట్టు పోలీసులు గుర్తించారు. నిందితుల ఖాతాల నుంచి మొత్తం రూ.547 కోట్ల లావాదేవీలు జ‌రిగిన‌ట్లు ప్రాథ‌మిక ద‌ర్యాప్తులో తేలింది.

పోట్రు మనోజ్ కళ్యాణ్ – రూ.114.18 కోట్లు

మెడ భాను ప్రియ (భార్య) – రూ.45.62 కోట్లు

మెడ సతీష్ (బావ) – రూ.135.48 కోట్లు

బొమ్మిడాల నాగలక్ష్మి – రూ.81.72 కోట్లు

నరసింహ కిరాణా & డైరీ, కరీంనగర్ (మ్యూల్ అకౌంట్) – రూ.92.54 కోట్లు

ఉడతనేని వికాస్ చౌదరి – రూ.80.41 కోట్లు

ఉద్యోగాల పేరిట అకౌంట్ మాఫియా

నిందితులు సత్తుపల్లి చుట్టుపక్కల గ్రామాలకు చెందిన నిరుద్యోగ యువకులను ఉద్యోగాల పేరుతో పిలిపించి, వారి పేర్లపై సేవింగ్స్‌, కరెంట్ అకౌంట్లు తెరిపించి, వాటిని సైబర్ నేరాలకు వినియోగించినట్టు విచారణలో తేలింది. కొందరికి రూ.3 వేల నుంచి రూ.10 వేల వరకు చెల్లించి అకౌంట్లు తెరవించారని పోలీసులు వెల్లడించారు. లింగపాలెం గ్రామానికి చెందిన జొన్నలగడ్డ తిరుమల సాయి, సత్తుపల్లికి చెందిన బాడిస మురళి తదితరులు ఏజెంట్లుగా పనిచేస్తూ రైతులు, నిరుద్యోగులను గుర్తించి అకౌంట్లు తెరవించారని తేలింది. ఈ అకౌంట్లను సైబర్ మోసాల డబ్బు చలామణీకి వాడినట్టు నిర్ధారణ అయింది.

అంతర్జాతీయ సైబర్ నెట్‌వర్క్

నిందితులు విదేశాల్లో కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి పెట్టుబడులు, మ్యాట్రిమోనీ, క్రిప్టో ట్రేడింగ్, బెట్టింగ్, గేమింగ్ పేర్లతో ప్రజలను మోసం చేసినట్టు పోలీసులు తెలిపారు. బాధితులను టెలిగ్రామ్ గ్రూపుల్లో చేర్చి ఫేక్ లింకుల ద్వారా ఖాతాలు ఖాళీ చేసినట్టు వెల్లడించారు. సైబర్ నేరాల ద్వారా వచ్చిన సొమ్మును డాలర్లు, క్రిప్టో కరెన్సీగా మార్చినట్టు దర్యాప్తులో తేలింది. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ డేటా ప్రకారం, ఈ అకౌంట్లపై దేశవ్యాప్తంగా వందల సైబర్ ఫిర్యాదులు నమోదై ఉన్నట్టు తేలింది. ఇప్పటికే పోట్రు ప్రవీణ్ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచినట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన నిందితులు, మ్యూల్ అకౌంట్లపై చర్యలు కొనసాగుతున్నాయని, సైబర్ నేరాల ద్వారా సంపాదించిన ఆస్తులను గుర్తించి జప్తు చేస్తామని స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఏవో.. యూరియా టోకెన్ల దందా

యూరియా టోకెన్ల దందా చెన్నారావుపేట‌లో బ‌య‌ట‌ప‌డిన ఏవో దందా సోషల్ మీడియాలో వైరల్ అయిన...

భూ భారతి పేరిట దోపిడీ!…. మీసేవ–స్లాట్ బుకింగ్ కేంద్రాల మోసం వెలుగులోకి

భూ భారతి పేరిట దోపిడీ! మీసేవ–స్లాట్ బుకింగ్ కేంద్రాల మోసం వెలుగులోకి జనగామలో రూ.78...

నదీజలాల్లో తెలంగాణ‌కు కాంగ్రెస్ ద్రోహం

నదీజలాల్లో తెలంగాణ‌కు కాంగ్రెస్ ద్రోహం ఫజల్‌ అలీ నుంచి విభజన వరకూ మోసాలు పాలమూరుకు...

చత్రపతి శివాజీ విగ్రహానికి నిప్పు

చత్రపతి శివాజీ విగ్రహానికి నిప్పు నూతన విగ్రహం ప్రారంభానికి ముందు దుండ‌గుల దుశ్చ‌ర్య‌ రాయ‌ప‌ర్తి...

భూపాల్ నగర్ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం

భూపాల్ నగర్ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం కాకతీయ, ములుగు ప్రతినిధి :...

మాసబ్‌ట్యాంక్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు

మాసబ్‌ట్యాంక్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు నిందితుడిగా ప్రముఖ నటి రకుల్‌ప్రీత్ సోదరుడు...

మేడ్చల్ డీసీసీపై కసరత్తు షురూ

మేడ్చల్ డీసీసీపై కసరత్తు షురూ రంగంలోకి టీపీసీసీ పరిశీలకులు జనవరి 1 వరకు క్షేత్రస్థాయిలో...

మున్నేటిలో దూకి యువతి ఆత్మహత్య

మున్నేటిలో దూకి యువతి ఆత్మహత్య ఖమ్మంలో విషాద ఘటన.. మృతురాలి స్వ‌స్థ‌లం ఒడిశా కాకతీయ, ఖమ్మం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img