ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మాజీ మేయర్ సునీల్ రావు
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగరంలోని 10వ డివిజన్ కట్టరాంపూర్, ఆటో స్టాండ్ సమీపంలో మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం నిర్వహించారు. అలాగే వాసన్ ఐ కేర్ కరీంనగర్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
ఈ శిబిరాలను మాజీ మేయర్, బీజేపీ నాయకుడు యాదగిరి సునీల్ రావు ప్రారంభించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు కోమల్ల విజయ్, హరి, భాస్కర్, రఘురాం తదితరులు పాల్గొన్నారు.శిబిరంలో స్థానికులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు కంటి సమస్యలపై అవగాహన కల్పించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.


