అష్లీ గార్డ్నర్ మెరుపులు
గుజరాత్ గ్రాండ్ విక్టరీ
కాకతీయ, స్పోర్ట్స్ డెస్క్ : 2026 మహిళల ప్రీమియర్ లీగ్‌లో గుజరాత్ జెయింట్స్ శుభారంభం చేసింది. ఈ లీగ్‌లో భాగంగా శనివారం నవీ ముంబయి వేదికగా యూపీ వారియర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 10 పరుగుల తేడాతో నెగ్గింది. 208 భారీ ఛేదనలో యూపీ ఓవర్లన్నీ ఆడి 8 వికెట్లకు 197 పరుగులకే పరిమితమైంది. లిచీఫీల్డ్ (78 పరుగులు) పోరాడింది. చివర్లో ఆశ శోభన (27 పరుగులు) మెరుపులు మెరిపించిన ఫలితం లేదు. గుజరాత్ బౌలర్లలో రేణుకా సింగ్ ఠాకూర్, సోఫీ డివైన్, వేర్హమ్ తలో 2, గార్డ్నర్, గైక్వాడ్ చెరో 1 వికెట్ పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 207 భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ అష్లీ గార్డ్నర్ (65 పరుగులు, 41 బంతుల్లో) మెరుపులు మెరిపించింది. అనుష్క శర్మ (44 పరుగులు), సోఫీ డివైన్ (38 పరుగులు), జార్జియా వేర్హామ్ (27 పరుగులు) రాణించారు. యూపీ బౌలర్లలో సోఫీ ఎకిల్‌స్టోన్ 2, డియేంట్ర డాటిన్, శిఖ పాండే తలో 1 వికెట్ దక్కించుకున్నారు.


