రవితేజ, నవీన్ పొలిశెట్టి
కొత్త సినిమాలకు టికెట్ రేట్ పెంపు
ఈ సినిమాలకు ప్రీమియర్ షోలు లేవు
కాకతీయ, సినిమా డెస్క్ : ఈ సంక్రాంతి సినిమాలు రాజాసాబ్, మన శంకరవర ప్రసాద్ గారు సినిమాల టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో రెండు చిత్రాల టికెట్ హైక్స్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. తాజాగా అనగనగా ఒక రాజు, భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాల టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇచ్చింది. అయితే ఈ సినిమాలకు ప్రీమియర్ షోలు లేవు.
ఆకట్టుకుంటున్న ట్రైలర్లు
భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాకు సింగిల్ స్క్రీన్‌లో రూ.50, మల్టీఫ్లెక్స్‌లో టికెట్ ధర రూ.75 పెంపునకు అనుమతి ఇచ్చింది. అనగనగా ఒక రాజు చిత్రానికి సింగిల్ స్క్రీన్‌లో రూ.50, మల్టీఫ్లెక్స్‌లో టికెట్ ధర రూ.75 పెంపునకు అవకాశం ఇచ్చారు. రెండు సినిమాలకు విడుదలైనప్పటి నుంచి తొలి 10 రోజులు పెరిగిన ధరలే ఉంటాయి. కాగా రవితేజ హీరోగా కిషోర్ తిరుమల భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాను తెరకెక్కించారు. ఇందులో డింపుల్ హయాతీ, అషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా జనవరి 13న గ్రాండ్‌గా ఈ సినిమా రిలీజ్ కానుంది. మరోవైపు, నవీన్ పొలిశెట్టి లీడ్‌లో మారి తెరకెక్కించిన అనగనగా ఒక రాజు సినిమా జనవరి 14 విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన ఈ రెండు సినిమాల ట్రైలర్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.


