epaper
Thursday, January 15, 2026
epaper

సాదా బైనామాల‌కు లైన్ క్లియ‌ర్ !

సాదా బైనామాల‌కు లైన్ క్లియ‌ర్ !
ఆరేండ్ల రైతుల ఎదురుచూపుల‌కు తెర !
త్వ‌ర‌లోనే అర్హులకు పట్టాదార్ పాస్‌ పుస్తకాలు ?
గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెచ్చిన జీవో 112పై హైకోర్టులో కేసు
పాత చట్టం స్థానంలో కొత్తగా భూభారతి రావటంతో తొలిగిన అడ్డంకులు
ఉమ్మడి జిల్లాలో సుమారు 1,66,784 దరఖాస్తులు
భూభారతి సదస్సుల్లో భారీగా వైనం

కాకతీయ‌, వ‌రంగ‌ల్ బ్యూరో: సాదా బైనామాలకు రంగం సిద్ధ‌మ‌వుతోంది. ఆరేళ్ల రైతుల నిరీక్షణకు త్వ‌ర‌లోనే తెరపడ‌నుంది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2020లో తీసుకువచ్చిన 112జీవో స్థానంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకరావటంతోపాటు సాదా బైనామాల పరిష్కారంపై విధివిధానాలను హైకోర్టుకు సమర్పించింది. దీంతో తనముందు ఉన్న పిల్‌ను న్యాయ‌స్థానం కొట్టివేయ‌డంతో లైన్ క్లియ‌ర్ అయింది. ఈక్ర‌మంలోనే ప్రభుత్వం సాదాబైనామాల దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. 2020 నుంచి ఉమ్మడి వరంగల్‌ జిల్లావ్యాప్తంగా సుమారు 1,66,784 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, కొత్తగా ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సుల్లోనూ భారీగా సైదాబైనామా దరఖాస్తులు వచ్చాయి. మొత్తంగా హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌తో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న సాదాబైనామాలకు ఇక మోక్షం కల‌గ‌నుంది.

2020లో హైకోర్టు స్టే

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సాదాబైనామాల సమస్య పరిష్కరించేందుకు 2016లో జీవో నెం.153ను తీసుకవచ్చింది. 2014 జూన్‌ 2వ తేదీకి ముందుగా సాదాబైనామాలతో భూములు కొనుగోలు చేసిన రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి చట్టబద్దత కల్పించాలని నిర్ణయించారు. 12 అక్టోబరు 2020లో కూడా జీవో నెంబరు 112ను జారీ చేసింది. మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసిన సాదాబైనామాల ప్రక్రియ ముందుకు సాగలేదు. సాదాబైనామాల సమస్య పరిష్కారం కాకుండానే 29 అక్టోబరు 2020లో జీవో నెంబరు 112ద్వారా కొత్త పట్టాదారు పాస్‌ పుస్తకాల చట్టాన్ని తెచ్చింది. అయితే ఈ జీవోను సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిల్ దాఖ‌లవ‌డంతో విచారణ జరిపిన హైకోర్టు జీవో అమలును నిలిపివేస్తూ 2020 నవంబరు 11న మధ్యంతర స్టే ఉత్తర్వులు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే.

1,66,784 మంది దరఖాస్తులు

ప్రభుత్వం సాదాబైనామాలకు చట్టబద్దత కల్పిస్తుందనే ఆశతో అప్పటికే ఉమ్మడి వరంగల్‌ జిల్లావ్యాప్తంగా 1,377 రెవెన్యూ గ్రామాల నుంచి 1,66,784మంది రైతులు దరఖాస్తులు చేసుకున్నారు. వరంగల్‌ జిల్లాలో 26,630 పెండింగ్‌ సాదాబైనామాలు ఉండగా, హనుమకొండ జిల్లాలో 27,057 దరఖాస్తులు, జనగామ జిల్లాలో 10,350 దరఖాస్తులు, మహబూబాబాద్‌ జిల్లాలో 31,250 దరఖాస్తులు, ములుగు జిల్లాలో 20,150 దరఖాస్తులు, భూపాలపల్లి జిల్లాలో 51,347 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటితోపాటు ఇటీవల నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సుల్లో కూడా భారీగా సాదాబైనామా దరఖాస్తులు వచ్చాయి. అన్ని రకాల పరిశీలన తరువాతే అర్హులను గుర్తించి పట్టాదారు పాస్‌ పుస్తకాలను అందించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.

భూ భారతితో లైన్‌ క్లియర్‌

రైతాంగం భూ హక్కుల కోసం కార్యాలయాల చుట్టు తిరుగుతున్న సమస్యలు పరిష్కారం కావటంలేదు. 2020లో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతులకు భూ హక్కులను కల్పించే పట్టాదారు పాసు పుస్తకాల చట్టం- 1971ని రద్దు చేసి కొత్తగా పాసుపుస్తకాల చట్టం-2020 ధరణిని తీసుకవచ్చింది. అయితే కొత్త చట్టం ద్వారా రైతు సమస్యలను పరిష్కరించేందుకు గత ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహించిన దాఖాలాలు లేవు. దీంతో సాదాబైనామాలతో పాటు అసైన్డ్‌ భూముల సమస్యల పరిష్కారానికి ధరణిలో ఎలాంటి మార్గాలను చూపించలేదు. దీంతో పాటు గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థను రద్దు చేయటంతో రైతుల కష్టాలు మరింత పెరిగాయి.

రైతుల‌కు ప్ర‌ధాన స‌మ‌స్య‌

రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒక్కటి సాదాబైనామా. గతంలో చాలా మంది రైతులు తెల్లకాగితాలపై, రెవెన్యూ స్టాంపు పేపర్ల‌పై భూములు క్రయవిక్రయాలు చేశారు. ఇవీ అధికారికం కాకపోవటంతో వీటికి రిజిస్ర్టేషన్లు జరగలేదు. ఫలితంగా బ్యాంకుల్లో వీరికి రుణాలు కూడా అందటం లేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతు సమస్యల పరిష్కారంపై ఫోకస్‌ చేసింది. గ‌త ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో రెవెన్యూ గ్రామ సదస్సులను నిర్వహించింది. ఈ సదస్సుల్లో అత్యధికంగా సాదాబైనామాలపైనే దరఖాస్తులు వచ్చాయి. గతంలో దరఖాస్తు చేసుకున్న రైతులు మరోసారి భూభారతి సదస్సులో దరఖాస్తులు చేశారు. దీంతో ప్రభుత్వం హైకోర్టును అశ్రయించి, సాదాబైనామాలపై మధ్యంతర స్టే ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరింది. దీంతో గత ప్రభుత్వం తీసుకవచ్చిన 112జీవో స్థానంలో కొత్తగా భూ భారతి చట్టం తీసుకవచ్చిన అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఎట్టకేలకు కోర్టు విచారణ అనంతరం సాదాబైనామాలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పల్లె పండుగలో పశువుల పరేడ్‌

పల్లె పండుగలో పశువుల పరేడ్‌ నర్సంపేట సంక్రాంతి సంబరాల్లో జీవ జాతులు గేదెలు,...

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌ ఆదివాసీ నాయకపోడు సంప్రదాయాలతో శుద్ధి పండగ...

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి అధికారులు...

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం కాకతీయ, దుగ్గొండి: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని...

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి ---- ఎస్సై కరుణాకర్ కాకతీయ, ఇనుగుర్తి: యువకులు చెడు...

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం డోర్నకల్ అభివృద్ధి బిఆర్ఎస్ హయాంలోనే కాంగ్రెస్ హామీలపై మాజీ...

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్ - ఎమ్మెల్యే దొంతి...

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి 19న సమ్మక్క–సారలమ్మ గద్దెల పునరుద్ధరణకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img