ఆసుపత్రులపై డీఎంఅండ్‌హెచ్‌వో ఆకస్మిక తనిఖీలు
స్కానింగ్ సెంటర్ల రికార్డుల పరిశీలన
కాకతీయ, కొత్తగూడెం రూరల్ : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారామ్ రాథోడ్ శనివారం పాల్వంచ పట్టణంలోని శ్రీ గణేష్ నర్సింగ్ హోమ్, పద్మావతి స్కానింగ్ సెంటర్, శ్రీరక్ష హాస్పిటల్ స్కానింగ్ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్కానింగ్ కేంద్రాల రికార్డులను పరిశీలించి, నిబంధనల ప్రకారం సేవలు అందిస్తున్నారా లేదా అన్నదాన్ని తనిఖీ చేశారు. చట్టవిరుద్ధంగా స్కానింగ్‌లు నిర్వహించి లింగ నిర్ధారణకు పాల్పడితే పీసీపీఎన్‌డీటీ చట్టం కింద కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. రిఫరల్ స్లిప్ ఉన్న వారికి మాత్రమే స్కానింగ్‌లు చేయాలని ఆదేశించారు. అలాగే ఆసుపత్రుల్లోని వార్డులు, ఆపరేషన్ థియేటర్లు, రక్త పరీక్ష కేంద్రాలను సందర్శించి పరిశుభ్రత, భద్రతపై తగిన సూచనలు ఇచ్చారు. ఈ తనిఖీల్లో డిప్యూటీ డెమో నాగలక్ష్మి, హెచ్‌ఓ భద్రు పాల్గొన్నారు.


