కాకతీయ, క్రైం డెస్క్: ఏపీలో దారుణం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం ఘంటావారిగూడెంలో అత్తమామలను దారుణంగా చంపాడు అల్లుడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 12 సంవత్సరాల క్రితం రామకోటేశ్వరరావు, నాగేశ్వరికి పెళ్లి జరిగింది. ఏడాది క్రితం నాగేశ్వరి తన పుట్టింటికి వచ్చింది. ఈ క్రమంలో బుధవారం అక్కడికి వచ్చిన రామకోటేశ్వరరావు..మామా బాబురావు, అత్త శారదను కత్తితో దారుణంగా హతమార్చాడు. భార్యపై కూడా దాడికి ప్రయత్నించాడు. నిందితుడిని నల్లజర్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అత్తమామలను అడ్డంగా నరికిన అల్లుడు.. చివరకు భార్యను కూడా..!!
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


