స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటుతాం
: మాజీ జడ్పీటీసీ పోలీసు ధర్మారావు
కాకతీయ, గీసుగొండ : రానున్న స్థానిక ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ సత్తా చాటుతామని మాజీ జడ్పీటీసీ పోలీసు ధర్మారావు అన్నారు. బీఆర్ఎస్ మండల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో దస్రు తండా, నందనాయక్ తండా, హర్జా తండా, గంగదేవిపల్లి గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులతో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ శక్తివంతంగా పోటీ చేసి విజయాన్ని సాధించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పులను సోషల్ మీడియా వేదికలపై ఎప్పటికప్పుడు ఖండించడంతో పాటు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ పోలీస్ ధర్మారావు, మండల పార్టీ కార్యదర్శి చల్లా వేణు గోపాల్ రెడ్డి, సమన్వయ కమిటీ సభ్యులు బోడకుంట్ల ప్రకాష్, అంకతి నాగేశ్వర్ రావు, పుండ్రు జైపాల్ రెడ్డి, ముంత రాజయ్య, కంబాల కోటి, గుర్రం రఘు, యూత్ అధ్యక్షుడు శిరిసే శ్రీకాంత్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ జూలూరి లెనిన్, యూత్ నాయకులు ప్రమోద్, మంద రాజేందర్, రాజు తదితరులు గ్రామాల అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


