‘మన శంకరవరప్రసాద్ గారు’కు
టికెట్ రేట్ పెంపు
ప్రీమియర్స్‌కు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
కాకతీయ, సినిమా డెస్క్ : మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా ప్రీమియర్స్‌కు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్పెషల్ షోతోపాటుగా టికెట్ రేటు పెంపునకు కూడా అనుమతి ఇచ్చింది. ఈమేరకు ప్రభుత్వం అధికారికంగా మెమో జారీ చేసింది. ఈ సినిమా జనవరి 12న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. దీనికి ఒకరోజు ముందు, జనవరి 11 రాత్రి ప్రీమియర్ షో ఉండనుంది. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్య షో ప్రదర్శించాల్సి ఉంటుంది. ఈ షో టికెట్ ధరను రూ.600 (జీఎస్టీతో కలిపి)గా నిర్ణయించింది. ఇక జనవరి 12వ తేదీ నుంచి ఏడు రోజులపాటు టికెట్ రేట్లు పెంచుకునేందుకు వెసులుబాటు ఇచ్చింది. ఈ సమయంలో సింగిల్ స్క్రీన్‌లో రూ.50 (జీఎస్టీతో కలిపి), మల్టీప్లెక్స్‌లలో రూ.100 (జీఎస్టీతో కలిపి) టికెట్ ధర అదనంగా ఉంటుంది. అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా శుక్రవారం రాత్రే ప్రీమియర్ షోతోపాటు టికెట్ పెంపునకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఏపీలో కూడా జనవరి 11న స్పెషల్ ప్రీమియర్ షో ఉండనుంది.
ఓవర్సీస్లో జోరు
సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓవర్సీస్లో జోరుగా సాగుతున్నాయి. యూకేలో ఇప్పటికే 20 వేల టికెట్లు సోల్డ్ అయ్యాయి. అటు యూఎస్ఏలోనూ ప్రీమియర్స్ సేల్ జోరుగా జరుగుతోంది. అక్కడ టికెట్ అమ్మకాలతో 5 లక్షల డాలర్లు ఇప్పటికే వసూల్ అయ్యాయి. రిలీజ్ నాటికి ఈ సంఖ్య పెరిగే ఛాన్స్ ఉంది. ఇక రిలీజ్ తర్వాత సినిమాకు టాక్ బాగుంటే ఓవర్సీస్లో వసూళ్లు పెరిగే ఛాన్స్ ఉంది. అక్కడ 3 మిలియన్ డాలర్ల క్లబ్లో చేరే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


