సమస్యలను వెలికి తీయడంలో ముందున్న కాకతీయ
ములుగు జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్
కాకతీయ, ములుగు ప్రతినిధి: సమాజంలో నెలకొన్న సమస్యలను వెలికి తీసి అక్షర రూపం ఇస్తున్న దినపత్రిక కాకతీయ అని ములుగు జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్ అన్నారు. శనివారం ములుగు జిల్లా కేంద్రంలోని రైస్ మిల్ అసోసియేషన్ భవనంలో కాకతీయ దినపత్రిక 2026 క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాదం ప్రవీణ్ మాట్లాడుతూ ప్రజలకు, అధికారులకు వారధిగా కాకతీయ దినపత్రిక పనిచేస్తుందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు ప్రజల సమస్యలను వెలికి తీసి, అక్షర రూపంలో ప్రజల ముందుకు తీసుకువచ్చి అధికారులను కదిలించే ప్రయత్నంలో కాకతీయ ముందువరుసలో ఉందని ప్రశంసించారు. నిజాయితీగల జర్నలిజం ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని, ఆ దిశగా కాకతీయ దినపత్రిక చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. పత్రిక యాజమాన్యానికి, రిపోర్టర్లకు, పాఠకులకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రైస్ మిల్ అసోసియేషన్ సీనియర్ అసిస్టెంట్ రాజు, కాకతీయ దినపత్రిక ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గాదె సుమన్, భిక్కనూరు సుమన్ తదితరులు పాల్గొన్నారు.


