కాకతీయ చరిత్రను ఇనుమడించాలి
ప్రజాపక్షం వహిస్తూ సమస్యల పరిష్కారంలో ముందుండాలి
వరంగల్ తహసీల్దార్ శ్రీకాంత్
కాకతీయ దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరించిన ప్రముఖులు
కాకతీయ, వరంగల్ : కాకతీయ చరిత్రను ఇనుమడించేలా కాకతీయ దినపత్రిక మీడియా రంగంలో దూసుకెళ్లాలని వరంగల్ తహసీల్దార్ శ్రీకాంత్ ఏనుమాముల సీఐ జీవాజీ సురేష్, బల్దియా అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్ లు అభిలషించారు. ప్రజాపక్షం వహిస్తూ.. సమస్యల పరిష్కారంలో ముందు నిలవాలని ఆకాంక్షించారు. కాకతీయ దినపత్రిక రూపొందించిన 2026 క్యాలెండర్‌ను వారివారి కార్యాలయాల్లో శుక్రవారం ఆవిష్కరించారు. సెప్టెంబర్ మాసంలో ఆధ్యాత్మికతను పంచేలా రూపొందించిన క్యాలెండర్ బాగుందని ప్రశంసించారు. ముఖ్యంగా భగవద్గీతపై ప్రజల్లో ఆసక్తి పెంపొందేలా క్యాలెండర్ ప్రచురించడం అద్వితీయమని అభివర్ణించారు. రానున్న రోజుల్లో కాకతీయ పత్రిక చరిత్ర సృష్టిస్తుందని అభిప్రాయపడ్డారు. సమాజంలో పేరుకుపోయిన సమస్యలతోపాటు అవినీతి, అక్రమాలను వెలుగులోకి తీసుకొచ్చి.. పత్రికా రంగంలో దూసుకెళ్లాలని ఆశించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఆనంద్, ఎంఆర్ఐ దినాకర్ దేవ్, ఏఆర్ఐ ఎం కృష్ణస్వామి, జిపిఓ చాగంటి వేణు, సుర రాజు, సర్వేయర్ సందీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


