టైలరింగ్‌తో మహిళలకు ఆర్థిక బలం
బీఆర్ఎస్ నాయకుడు తోట రామారావు
మాతృశ్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 60 మందికి శిక్షణ పూర్తి
కాకతీయ, ఖమ్మం : టైలరింగ్ శిక్షణతో మహిళలు ఆర్థికంగా స్వతంత్రంగా ఎదగాలని బీఆర్ఎస్ నాయకుడు తోట రామారావు అన్నారు. శ్రీ మాతృ మహిళా మండలి, మాతృశ్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని 46, 47, 48 డివిజన్లకు చెందిన 60 మంది మహిళలకు రెండు నెలలపాటు ఉచితంగా టైలరింగ్ శిక్షణ అందించారు. శిక్షణ ముగింపు సందర్భంగా శుక్రవారం సారధి నగర్‌లోని టిఆర్ఆర్ కాంప్లెక్స్‌లో మహిళలకు సర్టిఫికెట్లు, భోజన సదుపాయం కల్పించారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ తోట గోవిందమ్మ మాట్లాడుతూ మహిళలు నైపుణ్యాన్ని పెంచుకుని కుటుంబ ఆదాయానికి తోడ్పడవచ్చన్నారు. మాతృశ్రీ ఫౌండేషన్ ఉపాధ్యక్షురాలు ఎస్.కె. జాస్మిన్ మాట్లాడుతూ శిక్షణ పొందిన మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎస్.కె. అరీషా, ఎండి. చాందిని, కనకం భద్రయ్య, బొల్లెపల్లి విజయ్, ఆకుల సత్యం, జి. కృష్ణ నాయక్, తోట రమేష్ కుమార్, మాటేటి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.


