పేదలకు వరం సీఎం సహాయనిధి
అర్హులందరికీ పార్టీలకతీతంగా సాయం
: ఎంపీ రఘురాం రెడ్డి
25 మందికి రూ.7.65 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు
కాకతీయ, కొత్తగూడెం :పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక వరమని, సహాయం కోరిన ప్రతి అర్హుడికి పార్టీలకు అతీతంగా సాయం అందుతుందని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి అన్నారు. ఎంపీ సిఫారసుతో సీఎంఆర్ఎఫ్ ద్వారా 25 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.7,65,000 విలువైన చెక్కులను శుక్రవారం విద్యానగర్ కాలనీలోని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు దేవీ ప్రసన్నతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్య సేవలు పొందిన పేద, మధ్యతరగతి ప్రజలను ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఆరోగ్య భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. సీఎం సహాయనిధి అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ భూక్య రాంబాబు, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు చీకటి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.


