ప్రభుత్వ భూమికి హద్దులు ఏర్పాటు చేయాలి
అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని వినతి
ఇనుగుర్తి తహసిల్దార్‌కు ముప్పారం గ్రామస్తుల వినతి
కాకతీయ, ఇనుగుర్తి : కొంతమంది వ్యక్తులు ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తున్నారని, అట్టి భూమి అన్యాక్రాంతం కాకుండా హద్దులు నిర్వహించి కాపాడాలని చిన్న ముప్పారం గ్రామ ప్రజలు తహసిల్దార్ సుంకరి శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. శుక్రవారం మండల తహసిల్దార్ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ రాయలి భవాని శేఖర్ గ్రామస్తులతో కలిసి తహసిల్దార్‌ను కలిసి తమ సమస్యను వివరించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ 620, 623, 624, 522 సర్వే నంబర్లలో ఉన్న ప్రభుత్వ భూమిని కొందరు అక్రమంగా ఆక్రమించి అన్యాక్రాంతం చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే ఆ భూములకు హద్దులు నిర్ణయించి ప్రభుత్వ ఆస్తిని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిన్న ముప్పారం గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


