విప్పలమడకలో సేవల సందడి
18 రోజుల్లో రూ.1.57 లక్షలతో ఐదు కార్యక్రమాలు
గ్రామంలో మౌలిక వసతుల కల్పనే లక్ష్యం
: సర్పంచ్ హేమిమా చక్రపాణి
కాకతీయ, వైరా : వైరా మండలం విప్పలమడక గ్రామంలో మేడా శంకరయ్య–సుశీలమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.1.57 లక్షలతో పలు సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు గ్రామ సర్పంచ్ మేడా హేమిమా చక్రపాణి తెలిపారు. శుక్రవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన గ్రామ సభలో ఆమె మాట్లాడారు. కేవలం 18 రోజుల్లోనే ట్రస్ట్ ఆధ్వర్యంలో ఐదు సామాజిక కార్యక్రమాలు పూర్తిచేశామని తెలిపారు. గ్రామంలో రూ.75 వేలతో 100 వాట్ల ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేయగా, వైరాకు చెందిన పురుగు మందుల వ్యాపారి కొప్పుల వెంకటప్పారావు సహకారంతో రూ.20 వేల విలువైన సీసీ కెమెరాలు అమర్చినట్లు చెప్పారు. ఇమ్మడి పెద్ద వెంకయ్య జ్ఞాపకార్థం రూ.12 వేల విలువైన వాటర్ ప్యూరిఫైయర్, మన్నెం నాగేశ్వరరావు జ్ఞాపకార్థం ఆయన కుమారుడు మన్నెం సాయి రూ.30 వేల విలువైన ల్యాప్‌టాప్ అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు పారుపల్లి కృష్ణారావు, తుమ్మల జాన్ పాపయ్య, మాజీ ఎంపీటీసీ ఆకుల ప్రసాద్, ఉపసర్పంచ్ బూర్గు లూర్థమ్మ, కొలికొండ వీరభద్రరావు, వీరపనేని చెన్నకేశవరావు, కొల్లా వెంకటేశ్వరరావు, దేవభక్తిని అర్జున్ రావు, వార్డు సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.


