రొయ్యూరులో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి
మరికొంతమందికి తీవ్ర గాయాలు
కాకతీయ, ఏటూరునాగారం : జాతీయ రహదారి–163పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, ఆయన కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలయ్యాయి. ఏటూరునాగారం మండలం రొయ్యూరు సమీపంలోని భారత్ పెట్రోల్ బంక్ వద్ద శుక్రవారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వాజేడు గ్రామానికి చెందిన కాకర్లపూడి వీరభద్ర రాజు (49) తన కారు టీఎస్25 ఎఫ్ 2799లో కుటుంబ సభ్యులతో ప్రయాణిస్తుండగా, ఎదురుగా వచ్చిన ఏపీ 12 ఏల్ 2715 నంబర్ రికవరీ వాహనం ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. అతివేగం, అజాగ్రత్త కారణంగా ప్రమాదం జరిగిందని ఎస్‌ఐ రాజ్‌కుమార్ వెల్లడించారు. ప్రమాదంలో వీరభద్ర రాజు తీవ్ర గాయాలతో మృతి చెందగా, గాయపడిన ఇతరులను 108 అంబులెన్స్ ద్వారా ఏటూరునాగారం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


