ప్రజాసమస్యల ప్రతిబింబమే కాకతీయ
బీజేపీ నాయకులు కందిమల్ల మహేష్
తూర్పుకోటలో కాకతీయ క్యాలెండర్ ఆవిష్కరణ
కాకతీయ, ఖిలావరంగల్ : తూర్పుకోట అఖిల పక్ష నాయకుల ఆధ్వర్యంలో కాకతీయ దినపత్రిక 2026 నూతన సంవత్సరం క్యాలెండర్‌ను శుక్రవారం ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు కందిమల్ల మహేష్ మాట్లాడుతూ ప్రజాసమస్యలను నిరంతరం వెలుగులోకి తీసుకువస్తూ కాకతీయ దినపత్రిక సమాజంలో ప్రత్యేక గుర్తింపు పొందిందని ప్రశంసించారు. ప్రజలకు ఉపయోగకరంగా ఉండేలా క్యాలెండర్‌ను రూపొందించినందుకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బోగి సువర్ణ సురేష్ ముఖ్య అతిథిగా పాల్గొని కాకతీయ దినపత్రిక మరింత ప్రజాదరణ పొందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నాయకులు నర్రా ప్రతాప్, బోయిని దూడయ్య, బెడదా వీరన్న, అల్లం కేశవ రాజ్, చింతం అమర్ వర్మ, మేకల కుమార్, బేర వేణు, నలిగంటి అభిషేక్, పెసరు కుమారస్వామి, గన్నరపు ప్రభాకర్, బేర సాంబయ్య తదితరులు పాల్గొని క్యాలెండర్‌ను ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు.


