సత్యధర్మాలకు నిలువెత్తు ప్రతీక
తూర్పుకోట స్మశాన వాటికలో కాటికాపరి విగ్రహ ఆవిష్కరణ
హరిచంద్రుడి ఆదర్శాలు అనుసరణీయం : కార్పొరేటర్ సువర్ణ సురేష్
కాకతీయ, ఖిలావరంగల్ : తూర్పుకోట హిందూ స్మశాన వాటికలో కాటికాపరి సత్య హరిచంద్ర మహారాజు విగ్రహాన్ని శుక్రవారం ఘనంగా ఆవిష్కరించారు. తూర్పుకోట వాసులు బండి ఈశ్వరయ్య, బరుపాటి శేఖరయ్య జ్ఞాపకార్థంగా వారి కుమారుడు బండి కృష్ణ–పద్మజ దంపతులు సొంత ఖర్చులతో సుమారు రూ.80 వేల వ్యయంతో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. స్మశాన వాటిక అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ బోగి సువర్ణ సురేష్ హాజరయ్యారు. సత్యం, ధర్మం కోసం జీవితం అర్పించిన హరిచంద్రుడి ఆదర్శాలు ప్రతి ఒక్కరికీ మార్గదర్శకమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నలివెల రవీందర్, కందిమల్ల మహేష్, బెడదా వీరన్న, వనపర్తి ధర్మరాజు, బోలుగొడ్డు శ్రీనివాస్, మెడిశెట్టి రాజేష్, రంజిత్, చందర్, కేశవరాజు, ప్రతాప్, వేణు, నాండ్రే అమర్, బేర నరేందర్, దేవేందర్, సుంచు జగదీశ్, వీరన్న, పరమేష్, బండి ధనలక్ష్మి, సంతోష్, బండి కృష్ణ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


