శ్రేయాస్ అయ్యర్ మెడికల్ ఫిట్..
కివీస్‌తో వన్డే సిరీస్‌కు లైన్ క్లియర్
కాకతీయ, స్పోర్ట్స్ డెస్క్ : టీమిండియా బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్… కోలుకున్నట్లు సమాచారం. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో గాయపడ్డ అయ్యర్.. తాజాగా జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో రెండు వన్డేలు ఆడాడు. అతని ఫిట్‌నెస్ ఆధారంగా న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌లో ఆడేది లేనిది తేల్చాలని నిర్ణయించారు. అయితే బెంగుళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కీలకమైన అప్‌డేట్ ఇచ్చింది. శ్రేయాస్ అయ్యర్ అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడేందుకు మెడికల్‌గా ఫిట్ ఉన్నట్లు సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ పేర్కొన్నట్లు మీడియాలో కథనం వచ్చింది. దీంతో అతను కివీస్‌తో జరిగే వన్డే సిరీస్‌లో ఆడేందుకు లైన్ క్లియర్ అయ్యింది. ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో క్యాచ్ అందుకోబోయి అయ్యర్ కిందపడ్డాడు. ఆ సమయంలో అతని మోచేయి కడుపులో వత్తేసింది. దీంతో ఉదరంలోని స్ప్లీన్ దెబ్బతిని రక్తస్త్రావం జరిగింది. ఆస్ట్రేలియాలోనే అతనికి సర్జరీ జరిగింది. అయితే చికిత్స నుంచి కోలుకున్న అతను విజయ్ హజారే ట్రోఫీలో ఆడాడు.


