క్రీడలపై నిర్లక్ష్యం తగదు!
స్పెషల్ బడ్జెట్ కేటాయించాలి
డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి జీ తిరుపతి
కాకతీయ, కరీంనగర్ : గ్రామీణ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి క్రీడాకారుల ప్రతిభను వెలికితీయాలంటే ప్రభుత్వం క్రీడల కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి జీ తిరుపతి డిమాండ్ చేశారు. చిగురుమామిడి మండల డివైఎఫ్ఐ కమిటీ ఆధ్వర్యంలో, జిల్లా ఉపాధ్యక్షుడు ఏ.భాస్కర్ అధ్యక్షతన నిర్వహించిన క్రీడా పోటీల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రతి గ్రామం, మండలానికి క్రీడా మైదానాలు ఏర్పాటు చేసి మండల, జిల్లా స్థాయి పోటీలు నిర్వహించాలని సూచించారు. ప్రతి మండలానికి కోచులను నియమించాలని కోరారు. గతంలో మైదానాల పేరుతో నిధులు దుర్వినియోగం చేశారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సంపత్, జనార్ధన్, అంజనేయులు, క్రీడాకారులు అభిరామ్, రాకేష్, చరణ్ తేజ్, రాహుల్, రమేష్, చరణ్ తదితరులు పాల్గొన్నారు.


