కాంగ్రెస్, బీజేపీకి గుడ్‌బై చెప్పిన నేతలు
చల్లా ధర్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరికలు
కాకతీయ, పరకాల : ప్రజావ్యతిరేక విధానాలు, ఇచ్చిన హామీల అమలులో వైఫల్యంతో విసిగిపోయిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు బిఆర్ఎస్‌లో చేరుతున్నారని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. శుక్రవారం దామెర మండలం ఊరుగొండ గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ నాయకులు తమ పార్టీలకు రాజీనామా చేసి ఆయన సమక్షంలో బిఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో బిఆర్ఎస్ పాలనలోనే ప్రజలకు న్యాయం జరిగిందన్నారు. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో నమ్మకం కోల్పోయిందని విమర్శించారు. పార్టీలో చేరిన వారికి సముచిత గౌరవం, బాధ్యతలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ విజయమే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.


