మోడల్ స్కూల్లో ఘనంగా సంక్రాంతి వేడుకలు
కాకతీయ, నెల్లికుదురు : మండలంలోని లోని టి జి ఎం ఎస్ లో పాఠశాల ప్రిన్సిపల్ ఉపేందర్ రావు ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణాన్ని రంగురంగుల ముగ్గులతో విద్యార్థినీ విద్యార్థులు అందంగా అలంకరించారు. భోగి మంటలు, సంప్రదాయ వస్త్రధారణ, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థులు సంక్రాంతి ప్రాముఖ్యతను తెలియజేస్తూ పాటలు, నృత్యాలు ప్రదర్శించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని పండుగ ఉత్సవ వాతావరణాన్ని సృష్టించారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఈ వేడుకల ద్వారా విద్యార్థుల్లో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన పెంపొందించడమే లక్ష్యమని ప్రిన్సిపాల్ అన్నారు. అనంతరం ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందిస్తూ, భవిష్యత్తులో కూడా ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అంజుమ్ సుల్తానా,దేవేందర్, రాంనర్సయ్య నాగమోహన్, సక్రం, అబ్దుల్ నబి, కరుణ శ్రీ, కవిత, సునీతరెడ్డి, మహాలక్ష్మి, సునీత, చంద్రనాయక్, ఏకాంబరం,వెంకన్న తదితరులు పాల్గొన్నారు.


