epaper
Thursday, January 15, 2026
epaper

పోలీస్ దందా!

పోలీస్ దందా!
మితిమీరుతున్న ఎస్సై, సీఐల ఆగ‌డాలు
అక్ర‌మార్జ‌న కోసం కొంద‌రు అడ్డ‌దారులు
వ్యాపారుల‌ను పీడించి అక్ర‌మ వ‌సూళ్లు
కేసుల నుంచి త‌ప్పిస్తామ‌ని లంచాల కోసం వేధింపులు
ఇసుక‌, పీడీఎస్ బియ్యం అక్ర‌మ ర‌వాణాకు స‌హ‌కారం!
ఉన్న‌తాధికారుల హెచ్చ‌రిక‌లు బేఖాత‌ర్‌
తాజాగా కేయూ పీఎస్‌లో ఏసీబీ దాడులు
రూ. 15 వేలు లంచం తీసుకుంటూ ప‌ట్టుబ‌డిన ఎస్సై శ్రీకాంత్‌
పేకాట కేసు నుంచి త‌ప్పించేందుకు లంచం డిమాండ్‌
2026 సంవ‌త్స‌రంలో ఇదే ఏసీబీ మొదటి కేసు

కాకతీయ‌, తెలంగాణ బ్యూరో : ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొందరు ఖాకీలు కట్టు తప్పుతున్నారు. అక్రమార్జన కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. విధి నిర్వహణలో అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్న ఉన్నతాధికారుల హెచ్చరికలను బేఖాత‌ర్ చేస్తూ య‌థేచ్ఛ‌గా వసూళ్ల పర్వాన్ని కొనసాగిస్తున్నారు. వేటుపడుతున్నా లంచ‌గొండి అధికారుల్లో మార్పు రావడంలేదు. అక్రమార్కులతో అంటకాగడం, దోపిడీదారులతో చేతులు కలపడం, చీకటి వ్యాపారాలకు సహకరించడంతోపాటు కేసుల్లో ఇరుక్కున్న వాళ్లను లంచాల కోసం బెదిరింపులకు దిగుతున్నారన్న ఆరోపణలు వ‌స్తున్నాయి. పోలీస్ శాఖ ప్రతిష్టను దిగజార్చేలా కొందరు పని చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈక్రమంలోనే తాజాగా కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ ఎస్సై శ్రీకాంత్ ఏసీబీ అధికారులకు పట్టుబడటం డిపార్ట్‌మెంట్‌లో సంచలనంగా మారింది. ఈ ఘటన పోలీస్ శాఖలో జరుగుతున్న అవినీతిపై మరోమారు చర్చకు తెరలేపింది.

లంచం కోసం ఎస్సై వేధింపులు

హనుమకొండ జిల్లాలో అవినీతి నిరోధక శాఖ అధికారుల దాడులు క‌ల‌క‌లంరేపాయి. కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రీకాంత్ బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పేకాట కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోకుండా.. కేసును తేలిక చేసి, అతనికి అనుకూలంగా వ్యవహరించేందుకు ఎస్సై శ్రీకాంత్ రూ. 15వేల నగదును డిమాండ్ చేశారు. బాధితుడిని పదేపదే వేధిస్తూ డబ్బుల కోసం ఒత్తిడి చేయడంతో చేసేదేం లేక సదరు వ్యక్తి అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదును స్వీకరించిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో వల పన్ని గురువారం బాధితుడి నుంచి ఎస్సై శ్రీకాంత్ 15 వేల లంచం తీసుకుంటున్న సమయంలో దాడి చేసి పట్టుకున్నారు. ఎస్సై నుంచి లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్న అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. కేయూ ఎస్సై శ్రీకాంత్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడడం జిల్లాలో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. కాగా 2026 సంవత్సరంలో ఏసీబీ అధికారులు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేసు నమోదు చేయడం ఇదే మొదటిసారి కావ‌డం గ‌మ‌నార్హం.

గ‌త జ‌న‌వ‌రిలో సీఐ జ‌గ‌దీష్‌..

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో అవినీతి నిరోధకశాఖ దాడులు గ‌త జ‌న‌వ‌రిలో కలకలంరేపాయి. తొర్రూరు సీఐ జగదీష్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో వరంగల్ రేంజ్ ఏసీబీ అధికారులు జ‌న‌వ‌రి 6న సోదాలు నిర్వహించిన సంగ‌తి తెలిసిందే. తొర్రూరుకు చెందిన ఓ వ్యాపారిని సీఐ జగదీష్ రూ. 4 ల‌క్ష‌ల లంచం డిమాండ్ చేయ‌డంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో అధికారులు తొర్రూరు సీఐ కార్యాలయంలో దాడులు నిర్వహించి సీఐ జగదీష్‌ను అలుపులోకి తీసుకోవ‌డం, లంచం వ్యవహారంలో ఓ సీఐని ఏసీబీ అరెస్టు చేయడం అప్పట్లో సంచలనం రేకెత్తించింది.

క‌మిష‌న‌రేట్‌లో వ‌రుస ఘ‌ట‌న‌లు

2024 ఆగస్టులో వరంగల్ జిల్లా పర్వతగిరి ఎస్సై గుగులోత్ వెంకన్న అవినీతి నిరోధక శాఖ అధికారులకు
ప‌ట్టుబ‌డిన సంగ‌తి తెలిసిందే. స్టేష‌న్ బెయిల్ కోసం నిందితుడి నుంచి రూ. 40 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎస్సైతోపాటు డ్రైవర్‌ను అరెస్టు చేశారు. అదే సంవత్సరం పర్వతగిరి సీఐగా పనిచేస్తున్న ఈ శ్రీనివాస్ నాయక్‌తోపాటు వీఆర్‌లో ఉన్న ఎస్సై అనిల్ కుమార్‌ను అప్ప‌టి సీపీ అంబ‌ర్ కిషోర్ ఝా సస్పెండ్ చేశారు. ఓ కేసులో నిందితుల నుంచి భారీ డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు రావడంతో సీపీ ఇద్దరిపై వేటు వేశారు. అదే విధంగా హనుమకొండ జిల్లా ఎల్క‌తుర్తి ఎస్ఐ రాజ్‌కుమార్ అదే ఏడు డిసెంబర్ 20న స‌స్పెన్ష‌న్‌కు గుర‌య్యాడు. అక్రమార్కులతో అంట‌కాగుతున్నాడ‌నే ఫిర్యాదుల‌పై విచార‌ణ జ‌రిపిన సీపీ అంబ‌ర్ కిషోర్ ఝా ఎస్సై రాజ్‌కుమార్‌పై చర్యలు తీసుకున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం ఖ‌మ్మంలో పార్టీని నిల‌బెట్టేది ఎవ‌రు..? మాజీమంత్రినా..? మాజీ ఎంపీనా..? కారు దిగిపోతున్న...

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం అక్రిడిటేషన్లు తగ్గవు… మరింత పెరుగుతాయి జీవో–252లో మార్పులు, సూచనలకు...

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్ అమెరికా ఆంక్షలతో ఇరాన్ ఆర్థిక...

జంక్ష‌న్లు జామ్‌

జంక్ష‌న్లు జామ్‌ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ 6 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన...

మూసీ ప్రాజెక్టుతో రియ‌ల్ బూమ్‌

మూసీ ప్రాజెక్టుతో రియ‌ల్ బూమ్‌ ప్రాపర్టీ ధరలు హైక్ ! దాదాపు 15 నుండి...

క‌థ‌నం క‌ల‌క‌లం !

క‌థ‌నం క‌ల‌క‌లం ! ఐఏఎస్ అధికారికి, మంత్రికి మధ్య వివాహేతర బంధం ? అత్యంత...

విష‌మిచ్చి చంపండి

విష‌మిచ్చి చంపండి ఇప్ప‌టికే స‌గం చ‌నిపోయా మహిళా అధికారులను వివాదాల్లోకి లాగొద్దు రేటింగ్స్ కోసం మానసిక...

వివాదాలొద్దు

వివాదాలొద్దు ప‌క్క రాష్ట్రాల‌తో చ‌ర్చ‌ల‌కు సిద్ధం ప‌ర‌స్ప‌ర స‌హ‌కారంతో ముందుకుసాగుదాం ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ 2034...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img