విద్యార్థులకు స్కూల్ బ్యాగ్ మరియు కిట్లు పంపిణీ
కాకతీయ, నర్సింహులపేట : మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో సీకే బిర్లా గ్రూప్ వారి ఆర్థిక సహకారంతో నర్సింహులపేట మండల వాస్తవ్యులు చిన్న బిక్షపతి సహకారంతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సుమారు 150 మందికి దాదాపు రెండు లక్షల 50 వేల రూపాయల విలువైన బ్యాగ్ లగేజ్,హ్యాండ్ బ్యాగ్ కప్స్,టీషర్ట్స్ సామాగ్రి గ్రామ సర్పంచ్ పెద్దమాముల యాకయ్య గారి చేతుల మీదుగా గ్రామస్తుల సమక్షంలో బహుకరించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జినుకల రమేష్,పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు,గ్రామ ఉపసర్పంచ్ కాసయాకయ్య,, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్,నియోజకవర్గ కాంగ్రెస్ కార్యదర్శి రేఖఅనిల్ కుమార్ యాదవ్,గ్రామకాంగ్రెస్ కార్యదర్శి యాదగిరి,గ్రామవార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


