కాకతీయ, నేషనల్ డెస్క్: దేశవ్యాప్తంగా బెట్టింగ్ యాప్స్ అరాచకంగా ఎక్కువైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా యూత్, టీనేజర్లు ఈ యాప్స్ వలలో చిక్కుకుని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. భారీ లాభాలు వస్తాయన్న ఆశతో డబ్బుతోపాటు ప్రాణాలు తీసుకుంటున్నారు. అంతేకాదు కొన్నింట్లో మోసాలు, డేటా దోపిడీ, టాక్స్ ఎగవేత వంటి కేసులు కూడా భారీగా నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ పై జరిమానా 30శాతం విధించడంతోపాటు పాటు కొత్తగా తెచ్చిన ఆన్లైన్ గేమింగ్ బిల్ ద్వారా చట్టపరంగా వీటిని మరింత కంట్రోల్ చేసేందుకు రెడీ అయింది. కొన్ని బెట్టింగ్ యాప్స్ చట్టం విరుద్ధంగా నడుస్తున్నట్లు గుర్తించారు. ముఖ్యంగా విదేశాల నుంచి ఆపరేట్ చేసే ఆప్షోర్ యాప్స్ ఎలాంటి నిబంధనలు పాటించకుండా టాక్స్ ఎగవేస్తూ పనిచేస్తున్నాయి. దీనివల్ల యువత, ప్రజలు భారీగా మోసపోతున్నారు. ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి యాప్స్ ను ప్రమోట్ చేయడం వల్ల యువత ఈ యాప్స్ వైపు అట్రాక్ట్ అవుతున్నారు. ఈ సమస్యలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది.
కొత్త బిల్లు ఏం చెబుతుందంటే?
యూనియన్ క్యాబినెట్ మంగళవారం ఆన్లైన్ గేమింగ్ బిల్లును ఆమోదించింది. ఈ బిల్లు ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ను చట్టపరమైన ప్రేమ్ వర్క్ లోకి తీసుకువచ్చే లక్ష్యంతో దీన్ని రూపొందించింది. ఈ బిల్లు గేమ్స్, ఫ్రీ గేమ్స్ ను స్పష్టంగా వేరు చేస్తుంది. నైపుణ్యం అదృష్టం ఆధారిత గేమ్స్ మధ్య తేడాను నిర్ధారిస్తుంది. ఇకపై సెలబ్రిటీలు లేదా మీడియా సంస్థలు చట్టవిదంగా బెట్టింగ్ యాప్స్ తో ప్రమోట్ చేయకూడదు. ఆన్లైన్ గేమింగ్ లో జరిగే ఆర్థిక లావాదేవీలపై కఠిన నిబంధనలు వినియోగదారుల రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ బిల్లు ఆన్లైన్ గెమ్మింగ్ ను సురక్షితంగా జవాబుదారి తనంగా మార్చడం లక్ష్యంగా పెట్టుకుంది.
కాగా ప్రభుత్వం ఇప్పటికే ఈ విషయంలో చాలా చర్యలను తీసుకుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ 357 చట్ట విరుద్ధ నిబంధనలు పాటించని ఆప్షోర్ వెబ్సైట్స్ పై యూఆర్ఎల్ లింకు బ్లాక్ చేసింది. అంతేకాదు సుమారు 2,400 అకౌంట్స్ ను ఫ్రీజ్ చేసింది. 126 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకుంది. డైరెక్ట్ జనరల్ ఆఫ్ జిఎస్టి ఇంటెలిజెంట్ 700 అఫ్ షోర్ ఆన్లైన్ గేమ్స్ ఆపరేటర్ల పై టాక్స్ ఎగవేత, నిబంధనల ఉల్లంఘన పై దర్యాప్తు ప్రారంభించింది. ఇటీవల 392 బ్యాంక్ అకౌంట్ యూపీఐ ఐడి లతో సంబంధం ఉన్న ఆప్షోర్ ఎంపీటీలను ఫ్రీజ్ చేసింది. 122 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకుంది. ఇలాంటి చర్యలు ఐటీ చట్టం 2000 లోని సెక్షన్ 69 కింద మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహకారంతో జరిగాయి.
2023 అక్టోబర్ నుంచి ఆన్లైన్ గివింగ్ పై 28శాతం జిఎస్టి విధించింది. 2024-25 ఆర్థిక సంవత్సరం నుంచి గేమ్స్ ద్వారా వచ్చే గెలుపు మొత్తంపై 30శాతం పన్ను విధిస్తున్నారు. ఆఫ్షోర్ గేమింగ్ ప్లాట్ఫామ్స్ కూడా ఈ పన్ను నెట్ లోకి వచ్చాయి. చట్ట విరుద్ధమైన యాడ్స్ బ్లాక్ చేసే అధికారం కూడా అధికారులకు ఉంది . 2022 నుంచి 25 ఫిబ్రవరి వరకు ప్రభుత్వం 1400వందల బెట్టింగ్ యాప్స్, వెబ్సైట్ను యాప్స్ బ్లాక్ చేసింది.


