రోడ్ సేఫ్టీ మంత్ సందర్భంగా స్పెషల్ డ్రైవ్
కాకతీయ, తొర్రూరు : రోడ్ సేఫ్టీ మంత్‌లో భాగంగా పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద గురువారం పోలీసులు ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నంబర్ ప్లేట్ లేని వాహనాలు, హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులు, అలాగే సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలను ఆపి తనిఖీ చేశారు. హెల్మెట్ ధరించకపోతే జరిగే ప్రమాదాలు, ప్రాణనష్టం గురించి వాహనదారులకు పోలీసులు అవగాహన కల్పించారు. భవిష్యత్తులో హెల్మెట్ తప్పనిసరిగా ధరించి, సరైన ధ్రువపత్రాలతోనే వాహనాలు నడపాలని వాహనదారుల నుంచి హామీ తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో తొర్రూరు డీఎస్పీ శ్రీకృష్ణ కిషోర్, తొర్రూరు సీఐ గణేష్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు


