‘చీకటిలో’ థ్రిల్‌కు శోభిత రెడీ
కాకతీయ, సినిమా డెస్క్ : అక్కినేని ఫ్యామిలీ కోడలు శోభిత ధూళిపాళ ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌ల విషయంలో ఎంతో సెలెక్టివ్‌గా అడుగులు వేస్తోంది. పెళ్లి తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న ఆమె, తన వివాహ జీవితం ఎంజాయ్ చేస్తూనే కెరీర్‌పైనా స్పష్టమైన ఫోకస్ పెట్టింది. నాగచైతన్యతో కలిసి వెకేషన్‌లకు వెళ్లుతూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్న శోభిత ఇప్పుడు కొత్త క్రైమ్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శోభిత లీడ్ రోల్‌లో నటిస్తున్న ‘చీకటిలో’ అనే క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో జనవరి 23 నుంచి స్ట్రీమింగ్‌కు రానుంది. ఆద్యంతం ఉత్కంఠభరిత సన్నివేశాలతో ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమాలో శోభితతో పాటు విశ్వదేవ్ రాచకొండ మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. చిత్రానికి శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తుండగా, శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.
ఇక ఈ సినిమాలో చైతన్య కృష్ణ, ఈషా చావ్లా, ఝాన్సీ, ఆమని, వడ్లమాని శ్రీనివాస్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ ‘చీకటిలో’ స్ట్రీమింగ్ కానుంది. మరి జనవరి 23న విడుదల కానున్న ఈ థ్రిల్లర్ శోభితకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.


