epaper
Monday, March 2, 2026
epaper

కేంద్రం నిధుల‌తోనే వ‌రంగ‌ల్‌లో అభివృద్ధి

కేంద్రం నిధుల‌తోనే వ‌రంగ‌ల్‌లో అభివృద్ధి
కేఎంసీలో హాస్పిటల్, ట్రైబల్ వర్సిటీ, కోచ్ ఫ్యాక్టరీ కేంద్రం స‌హ‌కారంతోనే
డబుల్ ఇంజిన్ స‌ర్కారు వ‌స్తేనే రాష్ట్రంలో అద్భుత ప్ర‌గ‌తి
అన్నింటా రేవంత్ స‌ర్కారు విఫ‌లం.. భూముల అమ్మక‌మే ప్ర‌భుత్వ ల‌క్ష్యం
వరంగల్‌లో బీజేపీ చీఫ్ రాంచందర్ రావు ఫైర్
వ‌రంగ‌ల్ భద్రకాళి అమ్మవారి దర్శనం ఆధ్యాత్మిక శక్తినిచ్చిందంటూ వ్యాఖ్య‌

కాకతీయ, వరంగల్ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తుండగా, వరంగల్ అభివృద్ధి మాత్రం కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ముందుకు సాగుతోందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు స్పష్టం చేశారు. రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం వరంగల్‌కు వచ్చిన తొలి అధికారిక పర్యటనలో భాగంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. భద్రకాళి అమ్మవారి దర్శనం తనకు ఆధ్యాత్మిక శక్తినిచ్చిందని, ఆ ఆశీస్సులు పార్టీ కార్యకర్తలతో పాటు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. గతంలో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ సందర్శన సందర్భంగా కేంద్ర మంత్రులతో కలిసి వచ్చిన అనుభవాన్ని గుర్తుచేశారు.

కేంద్ర నిధులతోనే వరంగల్ అభివృద్ధి

వరంగల్ నుంచి బీజేపీ ఎంపీలు లేకపోయినా కేంద్ర ప్రభుత్వం రూ.2 వేల కోట్లకుపైగా నిధులతో అభివృద్ధి పనులు చేపట్టిందని తెలిపారు. కేఎంసీలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ములుగు సమ్మక్క–సారక్క ట్రైబల్ యూనివర్సిటీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే సాధ్యమయ్యాయని స్పష్టం చేశారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో వరంగల్‌కు చెప్పుకోదగిన అభివృద్ధి లేదని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కేంద్రం చేసిన పనులను తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. వరంగల్ మాస్టర్ ప్లాన్ పేరిట రూ.4 వేల కోట్లతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మిస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పటివరకు ఒక్క పనీ ప్రారంభించలేదన్నారు.

భూముల అమ్మకాలే ప్రభుత్వ ల‌క్ష్యం..ల‌క్ష‌ణం

రేవంత్ రెడ్డి ప్రభుత్వం అభివృద్ధి కంటే భూముల అమ్మకాలపైనే దృష్టి పెట్టిందని ఆరోపించారు. కాకతీయ యూనివర్సిటీలో అధ్యాపకుల కొరత ఉన్నా పట్టించుకోకపోవడం, విశ్వవిద్యాలయ భూములపై ప్రభుత్వం కన్నేయడం దుర్మార్గమని అన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, మౌలానా ఉర్దూ యూనివర్సిటీ భూములపై జరుగుతున్న కుట్రలను ప్రస్తావించారు. ఉస్మానియా యూనివర్సిటీకి వెయ్యి కోట్ల నిధులు ఇస్తామని చెప్పి ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం కాంగ్రెస్ పాలనకు నిదర్శనమని విమర్శించారు. అసెంబ్లీలో ప్రజల సమస్యలపై చర్చే జరగడం లేదని రాంచందర్ రావు ఆరోపించారు. రైతు బంధు నిలిపివేత, నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ బకాయిలు వంటి అంశాలపై ప్రభుత్వం మౌనం వహిస్తోందన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇస్తే అమృత్, స్మార్ట్ సిటీ, హృదయ్ వంటి కేంద్ర పథకాలతో అభివృద్ధి ఎలా జరుగుతుందో చూపిస్తామని ప్రజలను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ పూర్తి చేసి హ్యాండ్ఓవర్ చేస్తే మామునూరు ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి కేంద్రం పూర్తిగా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీకి ఆదరణ

ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధించిందని తెలిపారు. గతంలో 163 సర్పంచులు ఉండగా, ఇప్పుడు 900కి పైగా సర్పంచులు ఉండటం గ్రామీణ ప్రాంతాల్లో పార్టీపై పెరిగిన విశ్వాసానికి నిదర్శనమన్నారు. బీజేపీలో వర్గాలు లేవని, మోదీ నాయకత్వమే ఒక్కటే వర్గం అని స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధికి డబుల్ ఇంజిన్ సర్కార్ తప్పనిసరిఅని, ప్రజల పక్షాన నిలబడి ప్రతి సమస్యపై పోరాడతామని తేల్చిచెప్పారు. సమావేశంలో హనుమకొండ జిల్లా అధ్యక్షుడు సంతోష్ రెడ్డి, రావు పద్మ రెడ్డి, డా. పగడాల కాళీ ప్రసాద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గౌతంరావు, తుళ్ళ వీరేందర్ గౌడ్, యువ మోర్చా అధ్యక్షుడు గుండె గణేష్, అధికార ప్రతినిధి ఎన్.వి. సుభాష్, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీ సీతారామ్ నాయక్, రాష్ట్ర నాయ‌కుడు పేరం గోపికృష్ణ‌, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..?

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..? చైర్మన్ లేకుండానే కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు జాతర...

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం..

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం.. *ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు కొత్తగట్టు రాజేందర్...

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం డివైడర్‌ను ఢీకొట్టి బైక్‌.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం శనిగరం గ్రామంలో...

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..!

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..! మేజర్ గ్రామ సర్పంచ్ సహా నేతల కాంగ్రెస్‌లో...

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీసీపీ అంకిత్ హెచ్చరిక కాకతీయ,గీసుగొండ:...

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..!

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..! కొమ్మాల జాతరలో భద్రతపై నిర్లక్ష్యం? బావులకు కాంక్రీట్ గోడలు...

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..!

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..! కొమ్మాల జాతరకు సిద్ధమవుతున్న ప్రభల పందెం! ప్రదర్శనకు పార్టీల పోటాపోటీగా బండ్ల...

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే కాకతీయ, వరంగల్ సిటీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img