బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలి
కాకతీయ, ఆత్మకూరు : ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ తరహాలోనే బీసీలకు కూడా ప్రత్యేకంగా బీసీ సబ్ ప్లాన్‌ను చట్టబద్ధంగా అమలు చేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లెబోయిన అశోక్ ముదిరాజ్ డిమాండ్ చేశారు. గురువారం ఆత్మకూరు తహసీల్దార్ జగన్మోహన్ రెడ్డికి వినతిపత్రం అందజేస్తూ ఆయన మాట్లాడారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు తీన్మార్ మల్లన్న పిలుపు మేరకు బీసీ సబ్ ప్లాన్ అమలుకు డిమాండ్ చేస్తూ ఆత్మకూరు మండల తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించామని తెలిపారు. రాష్ట్రంలో జనాభాలో మెజారిటీగా ఉన్న వెనుకబడిన తరగతులను కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీలకు అమలు చేస్తున్న విధంగానే బీసీలకు కూడా తక్షణమే సబ్ ప్లాన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. బడ్జెట్‌లో జనాభా నిష్పత్తి ప్రకారం బీసీలకు నిధులు కేటాయించకపోవడం తీవ్రమైన అన్యాయమని అన్నారు. కార్యక్రమంలో హన్మకొండ జిల్లా అధ్యక్షులు వెంకటేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి బగ్గి రాజు, రాష్ట్ర నాయకులు పోలు రాజు, సోషల్ మీడియా సౌత్ తెలంగాణ కన్వీనర్ మార్త శ్రీనివాస్, ఉమ్మడి వరంగల్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ రమణ, కొమురయ్య, సాయికుమార్, జయ్ నాయక్, అబ్దుల్ రహీం, జగదీశ్వర్, తరుణ్, లక్ష్మణ్, బాలినే లక్ష్మి, మంచాల పద్మ, గడ్డం మాధవి, భువనగిరి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.


