మనస్థాపంతో వ్యక్తి బలవన్మరణం…
ఘటన స్థలంలో సూసైడ్ లేఖ లభ్యం
మృతుడు రాసిన లేఖలో నలుగురు పేర్లు
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కడారి గూడెంలో తీవ్ర కలకలం
కాకతీయ,రాయపర్తి /వర్ధన్నపేట: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కడారి గూడెం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.అదే గ్రామానికి చెందిన పింగిలి తిరుపతిరెడ్డి మనస్థాపంతో బలవన్మరణానికి పాల్పడిన ఘటన బుధవారం గ్రామంలో తీవ్ర కలకలం రేపింది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… గత కొద్ది సంవత్సరాల నుండి తిరుపతిరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాదులో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగించేవాడని తెలిపారు.ఆయనకు ఇద్దరు భార్యలు మొదటి భార్య గత 25 సంవత్సరాల క్రితం మృతిచెందగా రెండో వివహం చేసుకున్నాడని,బుధవారం ఉదయం తిరుపతి రెడ్డి తన ఇంటి ఆవరణంలో విగతజీవిగా పడిఉండడం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడ ఒక సూసైడ్ లేఖను గమనించారు.ఆg లేఖలో నలుగురి పేర్లు రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు గుర్తించారు.సూసైడ్ లేఖను స్వాధీనం చేసుకున్న పోలీసులు తిరుపతి రెడ్డి మృతికి గల కారణాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


