epaper
Monday, March 2, 2026
epaper

కోట భూములు ర‌క్షించండి

కోట భూములు ర‌క్షించండి
ఆక్ర‌మ‌ణ‌ల తొల‌గింపున‌కు చ‌ర్య‌లు చేప‌ట్టండి
క‌లెక్ట‌ర్ల‌కు లేఖ‌లు రాసినా స్పంద‌న లేదు
కోట భూములను ఏఎస్ ఐ ప‌రిధిలోకి తీసుకురావాలి
క‌బ్జాదారుల‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి
సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ

కాకతీయ, వరంగల్ సిటీ : వరంగల్ కోట భూముల ఆక్రమణలపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఈ మేరకు 2026 జనవరి 6న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి లేఖ రాసిన ఆయన, కాకతీయుల కాలం నాటి అపురూప చారిత్రక వారసత్వాన్ని కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని స్పష్టం చేశారు. వరంగల్ కోట భూములను భారత పురావస్తు శాఖ (ఏఎస్ ఐ)కు చెందినవిగా గుర్తించి, రెవెన్యూ రికార్డుల్లో తక్షణమే మార్పులు చేయాలని లేఖలో డిమాండ్ చేశారు. కాకతీయుల కాలంలో నిర్మితమైన వరంగల్ కోట చుట్టూ ఒకప్పుడు ఏడు ప్రాకారాలు ఉండేవని, ప్రస్తుతం అందులో కేవలం మూడు మాత్రమే మిగిలి ఉన్నాయని కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మిగిలిన ప్రాకారాల భూముల్లో స్థానికులు అక్రమంగా నిర్మాణాలు చేపట్టి చారిత్రక కట్టడాలను ధ్వంసం చేస్తున్నారని పేర్కొన్నారు. కోట చుట్టూ ఉన్న మట్టి గోడలు, రాతి గోడలను కూల్చివేస్తూ ఆక్రమణలు జరుగుతున్నా సంబంధిత శాఖలు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు.

నోటీసులకే పరిమితమైన ఏఎస్ఐ చర్యలు

వరంగల్ కోట భూముల ఆక్రమణలపై గతంలో ఏఎస్ ఐ అధికారులు జిల్లా కలెక్టర్‌కు పలుమార్లు లేఖలు రాసినప్పటికీ ఫలితం లేకపోయిందని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. 04-11-2022, 01-12-2025, 03-12-2025 తేదీల్లో కలెక్టర్‌కు లేఖలు ఇచ్చినా, ఆక్రమణల తొలగింపుపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి తగిన స్పందన రాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆక్రమణదారులపై పురావస్తు శాఖ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వరంగల్ కోట భూములు ప్రస్తుతం రెవెన్యూ రికార్డుల్లో “ప్రభుత్వ భూమి”గా నమోదై ఉండటం సమస్యలకు కారణమవుతోందని, వాటిని వెంటనే ASI భూములుగా సవరించాలని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. చారిత్రక వారసత్వ సంపదను కాపాడటం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని, ఇందుకోసం భారత పురావస్తు శాఖకు పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల వరంగల్ పర్యటన సందర్భంగా ఈ ఆక్రమణల విషయం తన దృష్టికి వచ్చిందని, అప్పటి నుంచే ఈ అంశంపై ఆందోళనతో ఉన్నట్లు కిషన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు వరంగల్ కోట వంటి చారిత్రక కట్టడాలు అందేలా తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.డి

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..?

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..? చైర్మన్ లేకుండానే కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు జాతర...

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం..

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం.. *ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు కొత్తగట్టు రాజేందర్...

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం డివైడర్‌ను ఢీకొట్టి బైక్‌.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం శనిగరం గ్రామంలో...

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..!

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..! మేజర్ గ్రామ సర్పంచ్ సహా నేతల కాంగ్రెస్‌లో...

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీసీపీ అంకిత్ హెచ్చరిక కాకతీయ,గీసుగొండ:...

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..!

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..! కొమ్మాల జాతరలో భద్రతపై నిర్లక్ష్యం? బావులకు కాంక్రీట్ గోడలు...

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..!

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..! కొమ్మాల జాతరకు సిద్ధమవుతున్న ప్రభల పందెం! ప్రదర్శనకు పార్టీల పోటాపోటీగా బండ్ల...

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే కాకతీయ, వరంగల్ సిటీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img