మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ శక్తి చాటాలి
జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి
కాకతీయ, హుజురాబాద్ : త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ శక్తి చాటాలని, హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలపై కాషాయ జెండాను ఎగురవేయడానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం హుజురాబాద్, జమ్మికుంట బిజెపి నాయకుల సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన ఆయన, మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించిన కార్యచరణ, విధానాలపై పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. గత బి ఆర్ ఎస్, నేటి కాంగ్రెస్ సర్కార్‌ల మున్సిపాలిటీల అభివృద్ధిపై చూపిన నిర్లక్ష్యాన్ని విమర్శిస్తూ, కేంద్రంలోని మోదీ సర్కార్ మద్దతుతో మున్సిపాలిటీల అభివృద్ధి కోసం బిజెపి కృషి చేస్తుందని తెలిపారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సహాయంతో హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలను అభివృద్ధి పథంలోకి తీసుకురావాలని, పట్టణ ముఖచిత్రాన్ని మార్చాలని భవిష్యత్ ప్రణాళికల్ని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకట్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు పుప్పాల రఘు, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్, హుజురాబాద్-జమ్మికుంట పట్టణ అధ్యక్షులు తుర్పాటి రాజు, కొలగాని రాజు, మండల అధ్యక్షులు ర్యాకం శ్రీనివాస్, రమణారెడ్డి, దేంచనాల శ్రీనివాస్, హుజురాబాద్ మండల ప్రధాన కార్యదర్శి మోడపు వినయ్ తదితరులు పాల్గొన్నారు.


