శాస్త్రీయ పద్ధతిలో అరటి సాగు లాభదాయకం
కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ వెంకట రాజ్ కుమార్
కాకతీయ, దుగ్గొండి: శాస్త్రీయ పద్ధతిలో అరటి సాగు లాభదాయకమని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ వెంకట రాజకుమార్ అన్నారు. మంగళవారం మండలంలోని లక్ష్మిపురం గ్రామంలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో శాస్త్రీయ పద్ధతిలో అరటి సాగుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమ ముఖ్యఅతిథిగా శాస్త్రవేత్త వెంకట రాజ్ కుమార్ పాల్గొని మాట్లాడారు. అరటిలో పోషక యాజమాన్యం మరియు ఎరువుల యాజమాన్యం నీటి యాజమాన్యం పద్ధతుల గురించి వివరించారు. కార్యక్రమంలో రైతు విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ విజయ భాస్కర్, జిల్లా ఉద్యాన అధికారి శ్రీనివాసరావు, ఉద్యాన శాఖ అధికారిని జ్యోతి, ఆయిల్ పామ్ ఫీల్డ్ ఆఫీసర్ అనిల్, గ్రామ సర్పంచ్ కన్నం అలిమా చిరంజీవి, రైతులు యుగంధర్, సురేందర్ దుర్గనాల వెంకటేశ్వర్లు రక్కిరెడ్డి నరసింహారెడ్డి, రైతులు పాల్గొన్నారు


