మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
బాలవికాస సేవలు అభినందనీయం
కెనడా సోఫాల్ డైరెక్టర్ సింగారెడ్డి శభ
కాకతీయ, తొర్రూరు : మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వచ్చి రాణించాలని కెనడా సోఫాల్ డైరెక్టర్ సింగారెడ్డి శభ అన్నారు. మంగళవారం తొర్రూరు డివిజన్ కేంద్రంలోని లయన్స్ క్లబ్‌లో బాలవికాస సంస్థ ఆధ్వర్యంలో మహిళా సాధికారత అంశంపై నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కెనడాలోని డీఈ రోచిలే పాఠశాల నుంచి ఉపాధ్యాయులు, విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సింగారెడ్డి శభ మాట్లాడుతూ, బాలవికాస సంస్థ ద్వారా వివిధ గ్రామాలకు చెందిన మహిళలు వ్యక్తిగతంగా, సామాజికంగా అభివృద్ధి చెందడం అభినందనీయమన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. మహిళల అభ్యున్నతికి బాలవికాస సంస్థ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. ఈ సమావేశంలో కెనడా ప్రతినిధులు జాస్కే బెలూన్, మనోలపాలిస్, నికోలస్, లిన్ లారో, హెలెన్ పాల్గొన్నారు. అలాగే బాలవికాస ప్రోగ్రాం మేనేజర్ లతా, జ్యోతి, అమూల్య, తొర్రూరు ప్రతినిధులు వై. రమ, ఎం. రమ, జె. శైలజ, ఎం. సరిత పాల్గొన్నారు.కంఠాయపాలెం, ఉప్పరిగూడెం గ్రామాల సర్పంచులు దుంపల శ్రీదేవి, రాగి సంగీతతో పాటు బాలవికాస ప్రతినిధులు రమేష్, సుకన్య, శోభ, సుమారు 30 మంది బాలవికాస మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే సమాజ అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు.


