విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రజా బాట
కాకతీయ, ఖిలా వరంగల్ : శివనగర్ పరిధిలోని బ్యాంకు కాలనీలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌పీడీసీఎల్) 35 వ డివిజన్ పరిధిలో మంగళవారం ‘ప్రజా బాట’ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా వరంగల్ డివిజన్ డీఈ శెంకేసి మల్లికార్జున్ మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న లో ఓల్టేజ్, లూస్ వైర్లు, విద్యుత్ సరఫరాలో అంతరాయం, ఎక్కువ–తక్కువ బిల్లులు, ట్రాన్స్‌ఫార్మర్లలో లోపాలు, కరెంటు వైర్లపై చెట్ల కొమ్మలు, ఇండ్లపై నుంచి వెళ్లే 11 కేవీ లైన్లు, రోడ్డుకు అడ్డంగా ఉన్న విద్యుత్ స్థంభాల వంటి సమస్యలను ప్రజా బాట ద్వారా నమోదు చేసి తక్షణమే పరిష్కరిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించే ప్రజా బాట కార్యక్రమం ఎంతో ఉపయోగకరమని అన్నారు.
ఈ కార్యక్రమంలో బ్యాంకు కాలనీ అధ్యక్షుడు శ్రీనివాస్, ఏడీ కిషోర్ కుమార్, ఏఈ రామకృష్ణ, రాజయ్య, లైన్ ఇన్‌స్పెక్టర్ సాంబరాజు, లైన్‌మెన్ శ్రీధర్, నాగరాజు తదితర విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.


