చైనా మాంజా వాడితే కఠిన చర్యలు తప్పవు
*గీసుగొండ సీఐ విశ్వేశ్వర్..
కాకతీయ, గీసుగొండ: ప్రభుత్వం,కోర్టు ఆదేశాల ప్రకారం చైనా మాంజా (నైలాన్ కైట్ స్ట్రింగ్) వినియోగం పూర్తిగా నిషేధించబడినట్లు గీసుగొండ పోలీసులు హెచ్చరించారు. నైలాన్,గాజు పూతతో తయారైన చైనా మాంజా ద్విచక్ర వాహనదారులు, పాదచారులు,పిల్లలు,పక్షులు, జంతువులకు తీవ్ర ప్రమాదం కలిగిస్తుందని తెలిపారు. దీని వల్ల రోడ్డు ప్రమాదాలు, విద్యుత్ లైన్లకు నష్టం, అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశముందని పేర్కొన్నారు.చైనా మాంజా తయారీ, అమ్మకం, నిల్వ, రవాణా వినియోగం శిక్షార్హమైన నేరమని, ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ విశ్వేశ్వర్ స్పష్టం చేశారు. పిల్లల భద్రత దృష్ట్యా తల్లిదండ్రులు కేవలం సురక్షితమైన కాటన్ కైట్ థ్రెడ్‌ను మాత్రమే ఉపయోగించాలని సూచించారు.


