వరంగల్ జిల్లాలో దారుణం…
అక్కా బావలపై బావమరది కత్తులతో దాడి
నర్సంపేటలో ఘటన…! భూ వివాదమే కారణమా…?
కాకతీయ, నర్సంపేట: భూ వివాదంలో అక్క బావ లపై భావమరిది మరికొంత మందితో కలసి నెక్కొండ రోడ్డులో కత్తులతో దాడి చేసి గాయపరచిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పట్టణానికి చెందిన సొప్పరి ఓదేలు భార్య సొప్పరి అరుణ లకు నర్సంపేట లోని నెక్కొండ రోడ్డులో అతడి బావమరిది శేషు మోహన్ కి గల భూమి వివాదమే దాడికి కారణమా మరేదైనా ఉందా అనేది తెలియాల్సిన ఉంది. దాడిలో ఓదెలుకు గాయాలవగా స్థానికులు నర్సంపేట ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన భార్య అరుణకు స్వల్ప గాయాలయ్యాయి. దాడి ఘటనతో పోలీసులను ఆశ్రయించిన బాధితుడి భార్య అరుణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


