epaper
Monday, March 2, 2026
epaper

హామీ మాటగా కాదు.. చేతలుగా నిలిచింది!

హామీ మాటగా కాదు.. చేతలుగా నిలిచింది!
ఆడబిడ్డ పుడితే రూ.2,000 నజరానా
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పెనుబ‌ల్లి మహిళా సర్పంచ్

కాకతీయ, కొత్తగూడెం : ఎన్నికల వేళ హామీలు ఇవ్వడం సాధారణమే. కానీ గెలిచిన తర్వాత వాటిని అమలు చేయడం అరుదు. అలాంటి రాజకీయ వాతావరణంలో ఇచ్చిన మాటకు కట్టుబడి నిలిచిన మహిళా సర్పంచ్‌గా పెనుబల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ రెడ్డి సుజాత పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం పెనుబల్లి గ్రామపంచాయతీ నుంచి సీపీఐ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన రెడ్డి సుజాత 350 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. గతంలో ఆమె భర్త రెడ్డి శ్రీనివాస్ సర్పంచ్‌గా పనిచేసి గ్రామాభివృద్ధికి బాటలు వేసిన నేపథ్యంలో, ప్రజలు మరోసారి విశ్వాసం వ్యక్తం చేస్తూ రెడ్డి సుజాతకు పట్టం కట్టారు.

ఎన్నికల హామీలకు కార్యరూపం

సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు రెడ్డి సుజాత శ్రీకారం చుట్టారు. మొదటి దశలో గ్రామం నుంచి స్మశానవాటిక వరకు సుమారు 400 మీటర్ల పొడవున సీసీ రోడ్ నిర్మాణ పనులను ప్రారంభించారు. అభివృద్ధితో పాటు సామాజిక బాధ్యతను కూడా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మరో కీలక హామీని అమలు చేశారు. గ్రామంలో ఆడబిడ్డ జన్మిస్తే రూ.2,000 ఆర్థిక సహాయం అందిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని సాకారం చేశారు. గ్రామానికి చెందిన అరవింద్–నందిని దంపతులకు ఆడబిడ్డ పుట్టిన విషయం తెలుసుకున్న సర్పంచ్, సోమవారం వార్డు సభ్యులు, సీపీఐ మండల నాయకుల సమక్షంలో ఆ కుటుంబానికి రూ.2,000 నగదు అందజేశారు. ఈ కార్యక్రమానికి స్పందించిన సీపీఐ మండల కార్యదర్శి వాసిరెడ్డి మురళి కూడా అదనంగా రూ.1,000 ఆర్థిక సహాయం అందించి అభినందించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రెడ్డి సుజాత మాట్లాడుతూ… గ్రామంలో జన్మించే ప్రతి ఆడబిడ్డకు ఈ సహాయం అందిస్తామని, బాలికలు, మహిళలకు ప్రభుత్వం ద్వారా వచ్చే అన్ని సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలయ్యేలా చూస్తానని తెలిపారు. అలాగే గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు కోసం ప్రణాళిక సిద్ధం చేశామని, త్వరలోనే ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. సర్పంచ్ చేపట్టిన ఈ కార్యక్రమం మహిళా సాధికారతకు, ఆడబిడ్డల పట్ల సమాజ దృక్పథం మార్పుకు దోహదపడుతుందని సీపీఐ నాయకులు, గ్రామస్తులు ప్రశంసించారు. ప్రజాప్రతినిధి అంటే మాటలకే పరిమితం కాకుండా చేతల్లో చూపించాలన్న సందేశాన్ని రెడ్డి సుజాత పెనుబల్లిలో స్పష్టంగా చాటుతున్నారని వారు వ్యాఖ్యానించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఇండ్ల మధ్య సెల్ టవర్లు… ప్రజల్లో ఆందోళన

ఇండ్ల మధ్య సెల్ టవర్లు... ప్రజల్లో ఆందోళన రేడియేషన్ భయం... అనుమతులపై అనుమానాలు సాయినగర్‌లో...

శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం కళ్యాణంలో పట్టువస్త్రాల సమర్పణ

శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం కళ్యాణంలో పట్టువస్త్రాల సమర్పణ కాకతీయ, కారేపల్లి: ఖమ్మం...

ఒత్తిడి లేకుండా పరీక్షలకు హాజరుకండి

ఒత్తిడి లేకుండా పరీక్షలకు హాజరుకండి పదో తరగతి విద్యార్థులకు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి...

మధ్యాహ్న భోజనంపై ఆకస్మిక తనిఖీ

మధ్యాహ్న భోజనంపై ఆకస్మిక తనిఖీ కాకతీయ, కూసుమంచి: కూసుమంచి మండలం జీళ్ళచెరువు గ్రామ...

కరువులో ‘ఉపాధి’ దీపం వెలిగించిన సర్పంచ్

కరువులో ‘ఉపాధి’ దీపం వెలిగించిన సర్పంచ్ కాకతీయ, కారేపల్లి: కరువు కాటుతో పంటలు...

పేదల గృహ స్వప్నాలకు ప్రభుత్వం తోడుగా

పేదల గృహ స్వప్నాలకు ప్రభుత్వం తోడుగా 14 మందికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరి...

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు సింగరేణిలో ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద నివాళులు త్యాగాలు...

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..!

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..! మణుగూరు–బయ్యారం రహదారి ధ్వంసం దుమ్ము ధూళితో గిరిజన బిడ్డల అనారోగ్యం ప్రజల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img